📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Nepal-నేపాల్‌లో హోటల్‌కు నిప్పు భారతీయ మహిళ దుర్మణం

Author Icon By Sushmitha
Updated: September 12, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేపాల్‌లో(Nepal) సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జెన్-జీ యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల నడుమ ఒక భారతీయ(Indian) మహిళ మరణించిన విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రాజేష్ దేవి గోలా (57), ఆమె భర్త రాంవీర్ సింగ్ గోలా పశుపతినాథ్ ఆలయ సందర్శన కోసం సెప్టెంబర్ 7న నేపాల్ వెళ్లారు.

హోటల్‌పై దాడి, దంపతులకు తీవ్ర గాయాలు

రాజధాని ఖాట్మండులోని హయత్ రీజెన్సీ హోటల్‌లో బస చేసిన దంపతులు, సెప్టెంబర్ 9న ఆందోళనకారులు హోటల్‌కు(Hotel) నిప్పుపెట్టడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. భారీగా చెలరేగిన మంటల నుంచి తప్పించుకునేందుకు, మరికొందరితో పాటు ఆ దంపతులు నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ దుర్ఘటనలో రాజేష్ దేవి గోలా మరణించగా, ఆమె భర్త రాంవీర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాధిత కుటుంబ సభ్యులు, నేపాల్‌లోని(Nepal) భారత రాయబార కార్యాలయం నుండి తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మరణం గురించి కూడా అధికారులు సమాచారం ఇవ్వలేదని వారు వాపోయారు.

కొనసాగుతున్న ఉద్రిక్తతలు

హింసాత్మక ఘటనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు, 1,338 మంది గాయపడ్డారు. రామెచ్చాప్ జిల్లాలోని జైలు వద్ద జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. ఖాట్మండు, లలిత్‌పూర్, భరత్‌పూర్ వంటి నగరాల్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. అయితే, పరిస్థితులు ప్రస్తుతం సద్దుమణుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ప్రధాని ఎంపికలో గందరగోళం
ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ(KP Sharma Oli) రాజీనామా చేసిన తర్వాత, నేపాల్‌లో తాత్కాలిక ప్రధాని ఎంపికపై గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ, ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్, ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

నేపాల్ అల్లర్లలో మరణించిన భారతీయ మహిళ ఎవరు?

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రాజేష్ దేవి గోలా (57).

ఆ దంపతులు ఎక్కడ చిక్కుకున్నారు?

ఖాట్మండులోని హయత్ రీజెన్సీ హోటల్‌లో వారు బస చేశారు.

Read Hindi News: hindi.vaartha.com

Read also: 

Google News in Telugu Indian victim Khatmandu Latest News in Telugu Nepal Protests political unrest Rajesh Devi Gola social media ban. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.