📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

NATO : భారత్‌కు నాటో కీలక హెచ్చరికలు

Author Icon By Sudha
Updated: July 16, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌కు నాటో (NATO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌ (India) సహా చైనా, బ్రెజిల్‌పై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఇంకా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, ఎరువులు, ఆయుధాలు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండటంపై నాటో (NATO) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామని రిపబ్లికన్‌ సెనేటర్‌ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా నాటో (NATO) కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్‌ అధ్యక్షుడు.. ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు గ్యాస్‌ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

NATO : భారత్‌కు నాటో కీలక హెచ్చరికలు

భారత్‌, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం

మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్, చైనా దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్‌ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్‌ తెచ్చే ఈ బిల్లు భారత్‌, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

7 NATO దేశాలు ఏమిటి?

స్థాపక సభ్యులు బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, UK మరియు US. నాటో యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం రష్యాతో సహా కమ్యూనిస్ట్ రిపబ్లిక్‌ల సమూహం అయిన మాజీ సోవియట్ యూనియన్ ద్వారా యూరప్‌లో విస్తరణను నిరోధించడం.

NATO అసలు పేరు ఏమిటి?

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO), 1949. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా సమిష్టి భద్రతను అందించడానికి యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు అనేక పశ్చిమ యూరోపియన్ దేశాలు 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌ను సృష్టించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం

Brazil china Geopolitics india latest news NATO russia tariffs TeluguNews Trade Sanctions US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.