📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

White House shooting : వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి, ట్రంప్ కీలక వ్యాఖ్యలు…

Author Icon By Sai Kiran
Updated: November 28, 2025 • 8:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

White House shooting : వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యురాలు సారా బెక్‌స్ట్రమ్ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటన దేశాన్ని కలచివేసిందని అన్నారు.

“సారా బెక్‌స్ట్రమ్ అత్యంత గౌరవనీయురాలు, యువతి, అసాధారణ వ్యక్తి. (White House shooting) ఆమె ఇప్పుడు మన మధ్య లేరు,” అని ట్రంప్ పేర్కొన్నారు. మరో గాయపడిన నేషనల్ గార్డ్ సభ్యుడు తీవ్ర పరిస్థితిలో ఉన్నాడని, ప్రాణాల కోసం పోరాడుతున్నాడని తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ అన్నారు.

Latest News: TG GP Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది

వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్యాట్రిక్ మోరిసీ కూడా సారా మరణాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. రాష్ట్రం, దేశం కోసం ధైర్యంగా సేవలందించిన జవాన్‌గా సారాను ఆయన అభివర్ణించారు.

కాల్పుల వివరాలు
సారా బెక్‌స్ట్రమ్ (20), ఆండ్రూ వోల్ఫ్ (24) నవంబర్ 26న థ్యాంక్స్‌గివింగ్‌కు ముందు రోజు వైట్ హౌస్‌కు సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వారి మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో లేరు.

దుండగుడు కూడా తీవ్ర స్థితిలో
ఈ దాడి చేసిన అనుమానితుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు ట్రంప్ తెలిపారు. అతడిని “మానవత్వం లేని వ్యక్తి”గా అభివర్ణించిన ఆయన, అతడి పరిస్థితి కూడా సీరియస్‌మని అన్నారు.

దాడి చేసిన వ్యక్తి 29 ఏళ్ల రహ్మానుల్లా లకాన్వాల్ అనే అఫ్గాన్ జాతీయుడిగా గుర్తించారు. అతడు 2021లో బైడెన్ పాలనలో ‘ఆపరేషన్ అలైస్ వెల్‌కమ్’ ద్వారా అమెరికా వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ఉగ్రవాద ఆరోపణలు నమోదు చేసే అవకాశముందని తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Afghan suspect US shooting Breaking News in Telugu Donald Trump statement FBI terrorism probe Google News in Telugu Latest News in Telugu National Guard injured National Guard shooting Rahmanullah Lakanwal Sarah Beckstrom death Telugu News US security breach Washington DC shooting White House shooting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.