📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కు ముక్కు నుంచి ఔషధం

Author Icon By Vanipushpa
Updated: February 1, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజురోజుకు క్యాన్సర్‌ రోగుల సంఖ్యా పెరుగుతున్నది. ప్రపంచాన్ని నేడు ఈ జబ్బు వణికిస్తున్నది. దీనితో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ప్రాణాంతక పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ చికిత్సకు అమెరికాలోని రైస్‌ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. పాంక్రియాటిక్‌(క్లోమ గ్రంధి) క్యాన్సర్‌ కణతులు చిన్న పేగు వంటి కీలకమైన అవయవాలకు సమీపంలో ఏర్పడతాయి. దీంతో అధిక డోస్‌తో రేడియేషన్‌ థెరపీ చేయడం వల్ల తీవ్రమైన జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్‌ కణతుల సమీపంలోని ఆరోగ్యకర కణజాలానికి నష్టం కలుగుతుంది. అయితే, ఆమైఫోస్టిన్‌ అనే ఔషధం రేడియేషన్‌ థెరపీ చేస్తున్నప్పుడు ఆరోగ్యకర కణజాలానికి రక్షణనిస్తుంది.


ఇప్పటివరకు సిరల ద్వారా ఇచ్చే ఈ ఔషధం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ అధికంగా ఉంటున్నందున ఎక్కువగా వినియోగించడం లేదు. నోటి నుంచి ఈ ఔషధాన్ని ఇస్తే కడుపులోని ఆమ్లాలు దాని ప్రభావాన్ని తగ్గించేస్తాయి. దీంతో రైస్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఔషధాన్ని ముక్కు నుంచి ఇచ్చే పద్ధతిని తయారు చేశారు. ఒక ట్యూబ్‌ ద్వారా నేరుగా ముక్కు నుంచి జీర్ణ వాహిక పై భాగానికి అందించవచ్చని వీరు చెప్తున్నారు. తద్వారా రేడియేషన్‌ థెరపీ సమయంలో ఆరోగ్యకర కణజాలానికి కలిగే నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ పద్ధతిని ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.

Nasal medicine New Approach pancreatic cancer researchers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.