📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

NASA: ట్రంప్ నిర్ణయాలతో ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్(Trump) అధికారంలోకి వచ్చాక మొత్తం అన్ని చోట్లా కాస్ట్ కటింగ్ చేశారు. ఫెడరల్ ఉద్యోగుల(Federal Employees)ను పీకేశారు. మిగిలిన వారి జీతాల్లో కోత పెట్టారు. అదేవిధంగా నాసాకు కూడా నిధులను తగ్గించేశారు. దీంతో నాసా(Nasa) సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు(Senior Staff) సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. 2026 ఆర్థిక సంవత్సరానికి నాసా నిధులను దాదాపు పావు వంతు తగ్గించాలని ప్రతిపాదించడం దీనికి కారణమని చెబుతున్నారు. అయితే సీనియర్ ఉద్యోగుల నిర్ణయం నాసా భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు.

NASA: ట్రంప్ నిర్ణయాలతో ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు

ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి..
ప్రస్తుతం నాసాలో జీఎస్-13 నుంచి జీఎస్-15 స్థాయిలలో ఉన్న సీనియర్ సిబ్బంది ఉద్యోగాల నుంచి పదవీ విరమణ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరిలో చాలా మంది అంతరిక్ష విజ్ఞానం, మానవ అంతరిక్ష యాత్రలు వంటి మిషన్-క్లిటికల్ విభాగాల్లో పని చేస్తున్నారు. ట్రంప్ బడ్జెట్ కోతల కారణంగా నాసా చాలా ప్రాజెక్టులను తగ్గించనుంది. దీని వలన నాసా పరిశోధనా సామర్థ్యాలు దెబ్బ తింటాయని నిపుణులు అంటున్నారు. ఇది ఆర్టెమిస్, అంగారక గ్రహం మిషన్ వంటి భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. నాయకత్వ లేమి, బడ్జెట్ అస్థిరత నాసా దీర్ఘకాలిక లక్ష్యాలను, ముఖ్యంగా మానవులను తిరిగి చంద్రునిపైకి పంపడం, అంగారక గ్రహంపైకి యాత్రలు వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది .

నాసా వికీపీడియా స్థాపకుడు ఎవరు?
జూలై 29, 1958న, ఐసెన్‌హోవర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ చట్టంపై సంతకం చేసి, నాసాను స్థాపించారు.
నాసా ఎందుకు ముఖ్యమైనది?
నాసా యొక్క ప్రత్యేకమైన లక్ష్యం పెద్ద మరియు చిన్న మార్గాల్లో ప్రయోజనాలను అందిస్తుంది. అంతరిక్ష పరిశోధన కోసం ఖర్చు చేసే డాలర్లు ఉద్యోగాలను సృష్టిస్తాయి, వ్యాపారాలను ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి.
భారత నాసా పితామహుడు ఎవరు?
డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్
డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ భారతదేశపు గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరు. ఆయనను భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా విస్తృతంగా భావిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News Latest News Breaking News NASA employees NASA staff protest space research jobs Trump administration impact Trump decisions NASA Trump vs NASA US science policy US space policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.