📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: నర్గెస్ మహమ్మదీకి మరో ఏడేళ్ల జైలు శిక్ష

Author Icon By Vanipushpa
Updated: February 9, 2026 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మానవ హక్కుల కోసం, ముఖ్యంగా ఇరాన్‌లోని మహిళల స్వేచ్ఛ కోసం మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ (Narges Mohammadi) (53) విషయంలో ఇరాన్ ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జైల్లో ఉండి నరకం చూస్తున్న ఆమెకు అక్కడి న్యాయస్థానం అదనంగా మరో ఏడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా ఆమెపై రెండేళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది మోస్తాఫా నిలీ ధ్రువీకరించారు.

Read Also: USA: ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఫైర్

Iran: నర్గెస్ మహమ్మదీకి మరో ఏడేళ్ల జైలు శిక్ష

అంతర్జాతీయంగా విమర్శలకు దారి

ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా నర్గెస్ మొహమ్మదీ ఫిబ్రవరి 2 నుంచి జైలులోనే నిరాహార దీక్షను చేపట్టారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి, ఆమె గొంతును మరింత బలంగా నొక్కే ప్రయత్నం చేయడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తోంది. తాజా తీర్పు ప్రకారం.. ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు గాను ఆరేళ్లు, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేసినందుకు మరో ఏడాదిన్నర శిక్షను ఖరారు చేశారు. అయితే, ఈ శిక్షావిధిపై ఇరాన్ అధికారిక యంత్రాంగం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

2023లో ‘నోబెల్ శాంతి బహుమతి’

మహిళా హక్కుల కోసం నర్గెస్ మొహమ్మదీ చేసిన అనేక ప్రయత్నాలకు ఇరాన్ ప్రభుత్వం పలుమార్లు అడ్డుతగిలింది. తన జీవిత కాలంలో ఆమె అనేక సార్లు అరెస్టు అయ్యారు. మరెన్నో సార్లు జైలు శిక్షను అనుభవించారు. చివరికి ప్రభుత్వ ఆదేశాలతో అమానుషమైన కొరడా దెబ్బలను కూడా తిన్నారు. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నుంచి వెనకడుగు వేయలేదు. ఆమె చేస్తున్న ఈ నిరంతర పోరాటాన్ని గుర్తించిన నోబెల్ కమిటీ.. 2023లో ఆమెకు ప్రతిష్టాత్మకమైన ‘నోబెల్ శాంతి బహుమతి’ని ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

human rights violation international concern Iran human rights activist Iran judiciary Narges Mohammadi political prisoners prison sentence Women Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.