📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Latest News: Nara Lokesh: అన్ని రంగాల్లో ఎపి అనూహ్య అభివృద్ధి

Author Icon By Saritha
Updated: December 12, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో ఐదోరోజున పలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ

విజయవాడ : ప్రపంచంలో అత్యంత(Nara Lokesh) ఆధునీక టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎపి అన్నిరంగాలో అనుహ్య అభివృద్ధిని సాధిస్తుందని ఎపి ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టంచేసారు. ఎపికి భారీ పెట్టుబడులను సాధించే క్రమంలో కెనడా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గోల్డి హైదర్, విక్టర్ థామస్తోతో ఎపి మంత్రి భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఎపికి అనుకూలమని ఆయన గోల్డీహైదర్ వివరించారు. ఫెయిర్ ఫాక్స్ సిఇఒ వాత్సాతో ఆయన భేటీ అయ్యారు, పనామా సిటీ తరహా రిసార్ట్స్ ఎపిలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇంటెలు మంత్రి లోకేష్ కోరారు. అమెరికాలో(America) అయిదవ రోజు నారా లోకేష్ పర్యటన జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన ఎందరో పారిశ్రామిక దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే గూగుల్ సంస్థతో ఆయన సంప్రదింపులు ఫలవంతంగా జరిగాయి. ఇంటెల్ అమరావతి ఏఐ రీసెర్చ్ సెంటర్ను శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ, ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. ఆ సంస్థ ఐటీ విభాగం సిఇఒ శేష కృష్ణపురతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. ఇంటెల్ ఆధారిత హెచ్పీసీ క్లస్టర్లు ఏర్పాటు చేసి విద్యాసంస్థలు. స్టార్టప్లు, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య, వ్యవసాయ, వాతావరణ నమూనా పరిశోధనలకు సహకరించాలి అన్నారు.

Read Also: ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

Nara Lokesh AP’s unprecedented development in all sectors

అడోబ్–ఎన్విడియా–ఇంటెల్‌తో కీలక చర్చలు

విశాఖలో(Nara Lokesh) అడోబ్ గ్లోబల్ కేపబులిటి సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలించాలని అడోబ్ సంస్థను మంత్రి లోకేశ్ కోరారు. ఆ సంస్థ సిఇఒ శంతను నారాయణ్ తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘అమెరికా టెక్ సంస్థలు ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి సంస్థలను అనుసంధానించి ఫ్యాబ్స్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల ఏర్పాటుకు సహకరిం చాలని కోరారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనల పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ్ పేర్కొన్నారు. ఎపిలో ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, భవిష్యత్ సాంకేతికతల బలోపేతానికి సహకరించాలని గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయూ తయారీలో అగ్రగామి సంస్థ ఎన్విడియాను మంత్రి లోకేష్ కోరారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్ మిర్పురితో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర సేవల్లో ఎఐ వినియోగానికి శిక్షణ, ఎఐ పాఠ్యాంశాల రూపకల్పనలో సూచనలు అందించండి.

విద్యార్థులు, పరిశోధకులకు క్వాంటమ్ సిమ్యులేటర్లు అందించేందుకు ఎపిలోని విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధన సంస్థలతో పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయండి. డిజిటల్ ట్విన్, ఎఐ ఆధారిత పరిశ్రమల ఆప్టిమైజేషన్ కోసం ఎన్విడియా ఓమ్నివర్స్, ఐజాక్ సిమ్ వినియోగించేలా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించండి. భారత్లో డీబ్లిక్ స్టార్టప్ల కోసం ఎన్విడియా కేటాయించిన 850 మిలియన్ డాలర్లను ఏపీలోని డీబ్లిక్ స్టార్టప్లు, మెంటారింగ్ కోసం కేటాయించండి అని ఆయన ప్రతిపాదించారు. వాటిపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజ్ మిర్పురి తెలిపారు. అమరావతి లేదా విశాఖలో పరిశోధన, అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని జూమ్ సంస్థ ప్రతినిధులను లోకేశ్ కోరారు. విశాఖలో ఎఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడంపై వారితో చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI Development Andhra Pradesh Intel Investments Latest News in Telugu Nara Lokesh Technology Telugu News us tour

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.