గత శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన పైలట్ నమాన్ష్ శ్యాల్ (Namansh Syal) మరణించారు.. ఆకాశంలో విన్యాసాలు చేస్తూ అకస్మాత్తుగా జెట్ కుప్పకూలడంతో ఆయనకు బయటపడే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Vijay: వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి ఖాయం: TVK పార్టీ చీఫ్
సూలూర్ ఎయిర్‌బేస్‌కు వింగ్ కమాండర్ భౌతికకాయం
వింగ్ కమాండర్ నామాన్ష్ స్యాల్ (Namansh Syal) భౌతికకాయం తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూర్ (Coimbatore) లోని సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని తమిళనాడుకు తరలించారు.అక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్యాల్ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు.తల్లి వీణ గృహిణి కాగా, నమాన్ష్ భార్య అఫ్షాన్ కూడా ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.నమాన్ష్, అఫ్షాన్ దంపతులకు ఆర్య (7) అనే కుమార్తె ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: