Nagaraju Balkam arrest: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఒక తెలుగు యువకుడు తప్పుడు మార్గంలో వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రం, శాంటా ఫే (Santa Fe) నగరంలో మైనర్ బాలికలతో ఆన్‌లైన్‌లో అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ, వారిని లోబరుచుకోవాలని ప్రయత్నించిన నాగరాజు బల్కం అనే తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Terrorist Attacks: భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
పోలీసుల ‘హనీ ట్రాప్’ ఆపరేషన్‌లో బుక్కయ్యాడు
ఆన్‌లైన్ ద్వారా మైనర్ బాలికలను వేధిస్తున్న వారిని పట్టుకోవడానికి శాంటా ఫే పోలీసులు ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు నకిలీ ప్రొఫైల్స్ (Fake Profiles) సృష్టించి, బాలికల ముసుగులో నిందితులతో చాటింగ్ చేశారు. ఇది తెలియని నాగరాజు, ఆ నకిలీ ప్రొఫైల్స్‌తో అసభ్యకరమైన రీతిలో చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
మరో ముగ్గురు కూడా అరెస్ట్
పోలీసులు చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో కేవలం నాగరాజు మాత్రమే కాకుండా, మరో ముగ్గురు వ్యక్తులు కూడా పట్టుబడ్డారు. వీరంతా ఆన్‌లైన్ వేదికగా మైనర్ల జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు, వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చదువుకోవడానికి వెళ్లి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అరెస్ట్ కావడం స్థానిక తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: