📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Shubman Gill: డబుల్ సెంచరీ తరువాత నాన్న ఫోన్ చేసి అభినందించారు: గిల్

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఆటతీరు ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఇంగ్లండ్ (England) గడ్డపై తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ.. వరుసగా రెండో సెంచరీ చేయడమే కాకుండా దాన్ని డబుల్ సెంచరీగా మల్చుకున్నాడు. ట్రిపుల్ సెంచరీ దిశగా సాగిన అతను 269 పరుగుల వద్ద ఔటయ్యాడు. తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకోవడంపై తన తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశాడని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ట్రిపుల్ సెంచరీ చేయకపోవడంపై మందలించాడని చెప్పాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం డబుల్ సెంచరీ (Double century) పై స్పందిస్తూ తన తండ్రి చేసిన కామెంట్స్‌ గురించి గిల్ పంచుకున్నాడు. ‘నేను డబుల్ సెంచరీ కొట్టగానే మా నాన్న ఫోన్ చేసి నన్ను అభినందించాడు. అంతేకాకుండా ట్రిపుల్ సెంచరీ ఎందుకు మిస్ చేశావ్? అని అడిగాడు.’అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

తల్లిదండ్రులు ప్రశంసించారు

శుభ్‌మన్ గిల్‌ను అభినందిస్తూ అతని తల్లిదండ్రులు పంపిన వాయిస్ మెసేజ్‌‌ను శుభ్‌మన్ గిల్ వింటున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వాయిస్ మెసేజ్‌లో శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) ను అతని తల్లిదండ్రులు ప్రశంసించారు. ‘అద్భుతంగా ఆడావు గిల్, నీ బ్యాటింగ్‌ను ఆస్వాదించా. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీ ఆటను చూస్తుంటే, నీ అండర్ 16, 19 రోజులు గుర్తుకువచ్చాయి. నిన్ను చూసి గర్వపడుతున్నా.’అని గిల్ తండ్రి లక్ష్యిందర్ సింగ్ తెలిపారు. ‘నీ బ్యాటింగ్ చూస్తుంటే చాలా సంతోషమేసింది. మున్ముందూ ఇలాగే ఆడాలి’అని గిల్ తల్లి ఆకాంక్షించారు.

ఈ మ్యాచ్‌లో మేం గెలుస్తామనే నమ్మకం

ఈ వీడియో తన తండ్రి గురించి గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇలాంటి వాయిస్ మెసేజ్‌లు ఆయన నుంచి నాకు ఎన్నో వస్తూనే ఉంటాయి. నేను ట్రిపుల్ సెంచరీ చేజార్చుకోవడంపై కూడా మేం మాట్లాడుకున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో మేం గెలుస్తామనే నమ్మకం ఉంది. క్రికెట్‌కు సంబంధించిన నేను ఇద్దరి అభిప్రాయాలను గౌరవిస్తా. ఒకరు మా నాన్న అయితే మరొకరు నా ఫ్రెండ్ అభిషేక్ శర్మ (Abhishek Sharma). నాన్న కోసమే క్రికెట్ ఆడుతున్నా, నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది మాత్రం నా స్నేహితుడితోనే. ఈ ఇద్దరు చెప్పే మాటలు జాగ్రత్తగా వింటా’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: BCCI: జడేజాపై బీసీసీఐ ఆగ్రహం?

#CricketHighlights #CricketNews #CricketRecords #CricketUpdate #DoubleCentury #EdgbastonTest #Gill269 #GillBatting #GillOnFire #GillPerformance #IndianCricket #IndianTestCaptain #IndiaVsEngland #INDvsENG #MissedTripleCentury #ProudMoment #ShubmanGillFans #TeamIndia #TestCricket 2nd Test Match Cricket News Cricket Records Double Century Edgbaston Test Father’s Comment Gill Father Reaction India Tour of England India vs England Test Indian Test Captain Latest News in Telugu Missed Triple Century Shubman 269 Runs Shubman Gill Shubman Gill Batting Shubman Performance#ShubmanGill Telugu News online Telugu News Paper Test Cricket Records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.