📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Canada: మేము ఎదగాలంటే భారత్‌తో వ్యాపారం చేయాల్సిందే

Author Icon By Vanipushpa
Updated: January 28, 2026 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ విషయంలో కెనడా రివర్స్ గేర్ వేసింది. ఇన్నాళ్లూ దౌత్య విభేదాలతో భారత్‌కు దూరంగా ఉన్న కెనడా.. గోవా వేదికగా జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్ 2026’ లో ఇరుదేశాల మధ్య ఇంధన బంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈక్రమంలోనే కెనడా ఇంధన శాఖ మంత్రి టిమ్ హడ్గ్‌సన్, భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగానే కెనడా(Canada) మంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్‌థో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read Also: Ajit Pawar: ఆయన చివరి కోరిక ఏంటో తెలుసా?

Canada: మేము ఎదగాలంటే భారత్‌తో వ్యాపారం చేయాల్సిందే

భారత్‌తో వాణిజ్యం చేయకుండా సాధ్యం కాదు

గోవా వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026లో పాల్గొన్న కెనడా మంత్రి టిమ్ హడ్గ్‌సన్.. “ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో భారత్ ఒకటి. ఒకవేళ కెనడా ఇంధన రంగంలో ‘సూపర్ పవర్’ కావాలని కోరుకుంటే.. అది భారత్‌తో వాణిజ్యం చేయకుండా సాధ్యం కాదు” అని తెలిపారు. ముఖ్యంగా అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య సవాళ్ల నేపథ్యంలో.. కెనడా భారత్ వైపు తన వ్యూహాన్ని మార్చుకుంది.
ఇరు దేశాల మంత్రుల చర్చల్లో కేవలం ముడి చమురుకే పరిమితం కాకుండా భవిష్యత్ ఇంధన అవసరాలపై భారీ ఒప్పందాలు కూడా కుదిరాయి. అలాగే హైడ్రోజన్ ఇంధనం, బయో ఇంధనాలు, బ్యాటరీ స్టోరేజ్, ఇంధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై కలిసి పని చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్‌లో భారత్‌కు కెనడా సహకారం అందనుంది. ఈ భేటీ అనంతరం హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి పథాన్ని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

business growth India economic opportunities export-import India global business strategy India international trade India market potential trade with India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.