📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Elon Musk: మస్క్ కీలక ప్రకటన.. వెనిజులాలో నెలపాటు ఫ్రీ ఇంటర్నెట్

Author Icon By Anusha
Updated: January 4, 2026 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ అమెరికా దేశమైనా వెనిజులాపై శనివారం అమెరికా దాడి చేసిన విషయం అందిరికీ తెలిసిందే.. ఈ దాడి తర్వాత, వెనిజులా అద్యక్షుడైన నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో, ప్రజలకు నిరంతరాయంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు నెల రోజుల పాటు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు.

Read also: Maria Corina Machado: ‘స్వేచ్ఛా గడియలు’ మొదలయ్యాయి

స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితం

వెనిజులా ప్రజలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ లో వెల్లడించారు. అమెరికా సైనిక చర్యలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన కొద్దిసేపటికే మస్క్ (Elon Musk) ఈ ప్రకటన చేయడం గమనార్హం. మదురో అరెస్ట్‌ను స్వాగతించిన మస్క్, ఆయన పాలన ముగియడంతో ఇకనైనా వెనిజులా అభివృద్ధి పథంలో పయనించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. “వెనిజులా ఇప్పుడు శ్రేయస్సును పొందగలదు” అని స్పానిష్ భాషలో వ్యాఖ్యానించారు.

లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా పనిచేసే స్టార్‌లింక్ నెట్‌వర్క్, దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో కనెక్టివిటీ సమస్యలు లేకుండా చూస్తుంది.ఫిబ్రవరి 3 వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. 2024 ఎన్నికల సమయంలో ప్రతిపక్షానికి బహిరంగంగా మద్దతు పలికిన మస్క్ (Elon Musk) , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు అండగా నిలిచారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న వెనిజులా, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే అభివృద్ధికి దూరమైందని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Elon musk free broadband latest news Starlink internet Telugu News Venezuela Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.