📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య వాస్తవమే..భర్త మృతదేహం లభ్యం

Author Icon By Shobha Rani
Updated: June 4, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయ పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్‌(Madya pradesh)కు చెందిన నవ దంపతులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. హనీమూన్ కోసం వచ్చిన ఈ జంట అదృశ్యం కాగా, 11 రోజుల తర్వాత భర్త దారుణ హత్యకు గురైనట్టు తేలింది. ఆయన మృతదేహాన్ని పోలీసులు లోతైన లోయ నుంచి స్వాధీనం చేసుకున్నారు. భార్య ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ(Raja Raghuvanshi), ఆయన భార్య సోనమ్ తమ హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23వ తేదీ నుంచి వీరు కనిపించకుండా పోయారు. అంతకు ముందు రోజు అంటే మే 22న ఈ జంట నోంగ్రియాట్‌కు చేరుకుని, షిపారా హోమ్‌స్టే నుంచి మే 23న చెక్ అవుట్ చేసినట్టు చివరిగా గుర్తించారు. వారు అద్దెకు తీసుకున్న స్కూటీని వారు అదృశ్యమైన మరుసటి రోజు సోహ్రారిమ్‌లో గుర్తించారు. గాలింపు చర్యల అనంతరం సోమవారం రియాత్ అర్లియాంగ్‌లోని వైసాడాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలోని లోతైన లోయలో డ్రోన్ సహాయంతో రాజా రఘువంశీ (Raja Raghuvanshi) మృతదేహాన్ని గుర్తించారు. ఆయనను కొడవలి (స్థానికంగా ‘దావ్’ అంటారు)తో నరికి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం సమీపంలో రాజా మొబైల్ ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.”ఇది కచ్చితంగా హత్యేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాధితుడిని హత్య చేశారు” అని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య వాస్తవమే..భర్త మృతదేహం లభ్యం

భారీ గాలింపు చర్యలు – మల్టీ ఏజెన్సీ సహకారం
అయితే, రాజా భార్య సోనమ్ రఘువంశీ (Raja Raghuvanshi) ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. “సోనమ్ రఘువంశీ ఇంకా దొరకలేదు. రేపు కూడా అదే ప్రాంతంలో, సమీప ప్రదేశాల్లో గాలింపు కొనసాగిస్తాం. మృతదేహం దొరికిన లోయ దాదాపు ఒకటి రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం సోనమ్‌ను కనుగొనడమే మా ప్రథమ కర్తవ్యం” అని ఎస్పీ వివరించారు. ఈ గాలింపు చర్యల్లో పోలీసులతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ప్రత్యేక కార్యకలాపాల బృందం (ఎస్‌వోటీ) కూడా పాల్గొంటున్నాయి. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో భద్రతపై తీవ్ర ఆందోళన. పర్యాటకుల పట్ల నేరచర్యలు పెరుగుతుండటంపై ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి.

Read Also: Iran: ఇరాన్‌లో కిడ్నాప్ అయిన భారతీయుల ఆచూకీ లభ్యం: భారత ఎంబసీ వెల్లడి

#telugu News Breaking News in Telugu couple's case is real.. Google news Murder in Madhya Pradesh Paper Telugu News Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.