📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడిపై తహవ్వుర్ రాణా అంగీకారం – NIA ముందు సంచలన విషయాలు

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా(Tahawwur Rana) అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు. తహవ్వుర్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా అతడు ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్రను అంగీకరించినట్లు తెలిసింది. ఢిల్లీ తీహార్‌ జైలు(Delhi Tihar Jail)లో ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వుర్‌ విచారణలో.. తాను పాకిస్థాన్‌(Pakistan) సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌ను అని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను, తన స్నేహితుడైన డేవిడ్‌ హెడ్లీకి పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు కూడా అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్ర సంస్థ ప్రధానంగా గూఢచారి నెట్‌వర్క్‌గా పనిచేస్తుందని కూడా రాణా ఎన్‌ఐఏకి చెప్పినట్లు సమాచారం.

Rana: ముంబై ఉగ్రదాడిపై తహవ్వుర్ రాణా అంగీకారం – NIA ముందు సంచలన విషయాలు

ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు. అతడు పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడా పౌరుడు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్‌ కోల్‌మాన్ హెడ్లీతో తహవూర్‌ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు. దాడి అనంతరం అమెరికాకు పారిపోయాడు. 2009లో రాణాను అక్కడి అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను అగ్రరాజ్యం ఇటీవలే భారత్‌కు అప్పగించింది.

పాకిస్థాన్ సైన్యానికి ‘నమ్మకమైన ఏజెంట్’గా పనిచేశానన్న రాణా
విచారణలో రాణా, తాను పాకిస్థాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్నని NIAకి తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా, తన స్నేహితుడు డేవిడ్ హెడ్లీ కూడా లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నారని అంగీకరించాడు.
లష్కరే తోయిబా – గూఢచారుల నెట్‌వర్క్‌గా పని చేస్తుందని వెల్లడన
రాణా, ఈ ఉగ్రవాద సంస్థ గూఢచారి నెట్‌వర్క్లా పని చేస్తుందని తెలిపాడు.
ముంబై దాడికి ముందుగా, హెడ్లీతో కలిసి ప్రణాళిక రచించిన విషయాన్ని నోటి వెంట అంగీకరించాడు .

Read Also:hindi.vaartha.com

Read Also:Brics: ట్రంప్‌ షాక్‌: బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు సుంకాలు

David Headley Mumbai attacks Lashkar-e-Taiba India latest news Mumbai 26/11 attacks NIA investigation Rana Tahawwur Rana confession Tahawwur Rana NIA custody

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.