📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Kerala : కేరళ తీరంలో MSC ELSA 3 ఓడ మునక

Author Icon By Shobha Rani
Updated: May 26, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ కోచి తీరంలో రెడ్ అలర్ట్. అక్కడి సముద్ర జలాలు విషతుల్యం కాబోతున్నాయి. సముద్ర జీవుల మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. కారణం..ఓ ఓడ. శనివారం సాయంత్రం లెబీరియాకు చెందిన ఓభారీ నౌక మునిగిపోయింది. ఇప్పుడు ఆందోళన మునిగిన ఓడగురించో..లేక కంటైనర్ల మునిగడంతో వచ్చిన నష్టం కాదు..కంటైనర్లలో ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు సముద్రంలో కలిశాయి. ఆ రసాయనాలు ఎంతమోతాదులో సముద్రజలాలను విషతుల్యం చేశాయో ఇంకా తెలియరాలేదు కానీ…ప్రమాదం మాత్రం ఊహించనంత ఉండబోతోందన్న టెన్షన్ పట్టుకుంది కేరళ తీరప్రాంతవాసులకు. అటు అధికారులకు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు…ఇంతకూ భయపడేంత డేంజర్ కెమికల్ ఆ ఓడలో ఏముంది…? లైబీరియాకు చెందిన MSC ELSA 3 కార్గో నౌక…శనివారం సాయంత్రం కొచ్చికి రావాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉంది. అరేబియా సముద్రంలో భారీ తుఫాను, ఈదురుగాలులు ఆఓడను చుట్టుముట్టాయి. కొచ్చికి 38నాటికల్ మైళ్లదూరంలో ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుపోయింది. సాయంత్రం 4.30గంటలకు ఒక్కసారిగా ఈదురుగాలుల తీవ్రతకు ఓ పక్కకు ఒరిగిపోయింది. వెంటనే నౌక సిబ్బంది మన ఇండియన్ కోస్ట్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన మన కోస్ట్‌గార్డ్ INSసుజాతతో ఓడలోని సిబ్బందిలో 18మందిని రక్షించి..తీరప్రాంతానికి తీసుకొచ్చింది. ఇంకా ముగ్గురు షిప్‌లోనే చిక్కుకుపోయారు. దీంతో మిగతా ముగ్గురిని అతికష్టం మీద ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ రక్షించగలిగారు. రాత్రి 11గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం ఓడలో 24మంది సిబ్బంది ఉన్నారు.

Viral Video: కేరళ తీరంలో MSC ELSA 3 ఓడ మునక

సముద్ర కాలుష్యం – పరిసరాలపై తీవ్ర ప్రభావం
ఓడ మునిగిపోవడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరమై, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ పరిస్థితుల్లో ఓడ సిబ్బంది నియంత్రణ కోల్పోయారు. ఓడలో ఉన్న 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ సముద్రంలో పడిపోయింది. కార్గో నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయి. అందులో 13కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. వీటిలో 12కంటైనర్లలో కాల్షియం కార్బైడ్‌ ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ రక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న కంటైనర్లను సేకరించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. సముద్రాన్ని శుద్ది చేయడం కష్టంగా మారింది. రసాయన కాలుష్య శుద్ధికి సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు తెలిపారు.

Read Also: Modi: మోదీపై సోఫియా ఖురేషీ కుటుంబం పూలవర్షంతో అభిమానం వ్యక్తం

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu MSC ELSA 3 ship Paper Telugu News sinks off Kerala coast Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.