📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Mp Sheshitharoor: పాక్‌ను చెదరగొడుతూ..కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టిన ఎంపీ శశిథరూర్‌

Author Icon By Shobha Rani
Updated: June 6, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindoor) పై వాస్తవాలను ప్రపంచానికి వివరిస్తున్న సందర్భంలో, అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ బృందాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Mp Sheshitharoor) నేతృత్వం వహిస్తున్న బృందం అమెరికా సహా ఐదు దేశాల్లో పర్యటిస్తోంది. నరేందర్‌.. సరెండర్‌ అయ్యారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు శశిథరూర్‌ (Mp Sheshitharoor) నుంచి వచ్చిన సమాధానం బీజేపీకి ఆయుధంగా మారింది. పాక్‌తో కాల్పుల విరమణ విషయంతో మూడో దేశం ప్రమేయం లేదన్న థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయి. అమెరికా పర్యటనలో పాక్‌ కుట్రను సవివరంగా వివరిస్తున్నారు శశిథరూర్‌(Mp Sheshitharoor). ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రపంచ దేశాలకు వాస్తవాలను వివరించడంలో కేంద్రం పంపించిన అఖిలపక్షం బృందాలు సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాయి. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Mp Sheshitharoor) నేతృత్వంలో వెళ్లిన బృందం పాకిస్తాన్‌ను చీల్చి చెండాడంలో విజయవంతమవుతోంది. శశిథరూర్‌ను బృందానికి లీడర్‌గా నియమించి మోదీ సర్కార్‌ రెండు లక్ష్యాలను సాధిస్తోంది. ఓవైపు పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టడమే కాదు.. కాంగ్రెస్‌కు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది శశిథరూర్‌ (Mp Sheshitharoor) బృందం.. అమెరికా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు శశిథరూర్‌. డొనాల్డ్ ట్రంప్‌ ఫోన్‌లో బెదిరించడంతోనే భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. దీంతో ఆయన రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టినట్టుగా భావించాల్సి వస్తోంది. ఆపరేషన్‌ సింధూర్‌పై కాంగ్రెస్‌ లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు థరూర్‌ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆపరేషన్‌ సింధూర్‌పై కేంద్రానికి ప్రశ్నలు సంధిస్తుంటే, థరూర్‌ మాత్రం మోదీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీకి కొండంత బలాన్ని ఇస్తోంది.

Mp Sheshitharoor: పాక్‌ను చెదరగొడుతూ..కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టిన ఎంపీ శశిథరూర్‌

రాహుల్‌ వ్యాఖ్యలకు తాత్కాలిక కౌంటర్?
పాకిస్తాన్‌తో యుద్దాన్ని కోరుకోవడం లేదని, కాని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతోనే ఆపరేషన్‌ సింధూర్‌ను విజయవంతంగా నిర్వహించామని అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్‌ వివరించారు. భారత్ పరిస్థితి ఏమిటన్నది అమెరికాకు క్లియర్‌కట్‌గా అర్థమైందన్నారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని.. కానీ బలవంతంగా కాదని స్పష్టం చేశారు.‘‘పాకిస్తాన్‌తో మేము యుద్దాన్ని కోరుకోవడం లేదు.. పౌక్‌ పౌరులపై మాకు దాడి చేసే ఉద్దేశ్యం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పంచడంతోనే వాళ్ల స్థావరాలపై మేము దాడి చేశాం. ఉగ్రవాద శిబిరాలను ఎందుకు మూసేయడం లేదు. టెర్రర్‌ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు. మీరు దీనికి సిద్దంగా లేనందునే విధి లేని పరిస్థితుల్లో దాడులు చేశామని’’ థరూర్ అన్నారు.
ఐదు దేశాల్లో విస్తృత ప్రచారం
ఐదు దేశాల్లో శశిథరూర్‌ బృందం పర్యటిస్తోంది. గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో ఆపరేషన్‌ సింధూర్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. కొలంబియా తొలుత పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించింది. భారత్‌ దాడిలో పాక్‌లో చిన్న పిల్లలు చనిపోయారని, వాళ్లకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించింది. కాని శశిథరూర్‌ పర్యటన తరువాత కొలంబియా తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంది.శశిథరూర్ వ్యాఖ్యలు, పర్యటన అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతును పెంచుతుండగా, దేశీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి రాజనీతికంగా చక్కటి వ్యూహ విజయంగా నిలిచింది.

Read Also: Mohan Bhagwat: పహల్గామ్ దోషులకు సరియైన శిక్షే: మోహన్

Breaking News in Telugu dispersing Pakistan Google news MP Shashi Tharoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news who has put Congress in a tight spot by

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.