📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Uttara pradesh: లవర్ కోసం కన్న బిడ్డను హత్య చేసిన తల్లి

Author Icon By Shobha Rani
Updated: May 22, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో కన్న బిడ్డనే కడతేర్చింది ఓ కసాయి తల్లి. తన నాలుగేళ్ల కుమారుడిని దారంతో గొంతు నులిమి ఆ తర్వాత శరీరం భాగాలపై గాయపరిచి హత్య చేసింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్​(Uttara pradesh) లో జరిగింది. బాధితుడి తండ్రి సుశీల్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనీషా(Manisha) నే హంతకురాలిగా గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్పుర్​ గ్రామానికి చెందిన సుశీల్, మనీషా దంపతులు. అయితే, మనీషాకు వికాస్​ (vikhas)అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి అడ్డుగా వస్తున్నాడని కుమారుడిని అంతమొందిచాలని మనీషా భావించింది. పధకం ప్రకారం తన కొడుకుని దారంతో గొంతు నులిమి చంపేసింది.

Lucknow: లవర్ కోసం కన్న బిడ్డను హత్య చేసిన తల్లి

దారంతో గొంతు నులిమి, శరీరంపై గాయాలు చేసి హత్య
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి జీవించడానికి తన కుమారుడు అడ్డుగా వస్తున్నాడని, అతడిని అంతమొందిచినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడిని చంపినందుకు ఆమె మోహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనపడలేదన్నారు. అంతేకాకుండా ఆ మహిళా తాను ఇదివరకే ఇద్దరు పిల్లల్ని కోల్పోయినట్లు తమ విచారణలో తెలిందన్నారు. కుమారుడి మరణం తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకొని జీవించాలని వారిద్దరూ భావించినట్లు పోలీసులు తెలిపారు.
మనీషా, వికాస్ అరెస్ట్..
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనీషా (Manisha) ప్రియుడు వికాస్​(vikhas)ను పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఘటన తర్వాత వికాస్​ పరారీలో ఉండగా, అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి నార్వల్​వద్ద వికాస్​ (vikhas) తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. అతడ్ని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. మాతృత్వాన్ని మరిచి ప్రియుడికోసం బిడ్డను చంపడం అనేది మానవత్వానికి తిట్టు అంటించే పని అని పలువురు గ్రామస్థులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్వల్​ పోలీస్​స్టేషన్​ ఇన్​చార్జి రామ్​ మురాఠ్​ పటేల్​ చెప్పారు. కాగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.

Read Also: Terrorists Enter India: భారత్‌లో చొరబాటుకు పాకిస్థాన్ ఉగ్రవాదుల యత్నం

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mother Killed Paper Telugu News Son Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.