📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Most Expensive Rice in The world : ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఏంటో తెలుసా..?

Author Icon By Sudheer
Updated: November 8, 2025 • 6:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా రకరకాల బియ్య రకాలు ఉత్పత్తి అవుతున్నా, వాటిలో జపాన్‌లో ఉత్పత్తి అయ్యే కిన్మెమై ప్రీమియం (Kinmemai Premium) బియ్యం అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. ఈ బియ్యం ఒక్క కిలోకు దాదాపు రూ.12,500 ధర పలుకుతోంది. విలాసవంతమైన జీవనశైలికి సంకేతంగా నిలిచిన ఈ బియ్యం 2016లో 840 గ్రాములకు రూ.5,490 ధరతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో “ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం”గా నమోదైంది. జపాన్ రైతులు దీన్ని అత్యంత శ్రద్ధతో, అధునాతన వ్యవసాయ సాంకేతికతతో పండిస్తారు.

Samantha Raj – Nidimoru : రాజ్ నిడిమోరు – సమంత పిక్ వైరల్ ..మరి ఎంత క్లోసా..!!

కిన్మెమై ప్రీమియం బియ్యం ప్రత్యేకత దాని ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ విధానంలో ఉంది. ఈ బియ్యాన్ని సాధారణ మిల్లింగ్ పద్ధతుల్లో కాకుండా, ప్రత్యేక కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీతో ప్రాసెస్ చేస్తారు. ధాన్యంలోని సహజ పోషకాలు, రుచిని కాపాడుతూ బియ్యాన్ని పలుచన చేస్తారు. వడ్లను వివిధ దశల్లో శుభ్రపరచి, నాణ్యతను కాపాడే విధంగా బియ్యంగా మారుస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి గింజను యాంత్రికంగా కాకుండా, నాణ్యత ఆధారంగా వేరు చేసి ప్రాసెస్ చేయడం వల్ల ఈ బియ్యం అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది.

ఈ బియ్యం మరో ప్రత్యేకత ఏమిటంటే.. వండే ముందు దీన్ని కడగాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా మార్కెట్లో లభించే బియ్యం వడ్ల పొరలను పూర్తిగా తొలగించడంతో కొంత రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కానీ కిన్మెమై ప్రీమియంలో ధాన్యం లోపలి పోషక విలువలు అలాగే ఉండేలా తయారు చేస్తారు. ఫలితంగా ఈ బియ్యం తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. జపాన్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలాసవంతమైన హోటళ్లు, ఆరోగ్య ప్రియులు ఈ బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఇది కేవలం ఆహారం కాదు, “ప్రీమియం హెల్త్ లగ్జరీ”గా పేరుగాంచింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Kinmemai Premium Most Expensive Rice world

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.