📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Monika Kapoor: మోనికా కపూర్ కేసు సీబీఐ కస్టడీకి అప్పగింత

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎప్పుడో 1999లో తన సోదరులతో కలిపి మనీ లాండరింగ్(Money Laundering) నేరాలు చేసింది మోనికా కపూర్(Monika Kapoor). ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో తన సోదరులతో కలిసి నకిలీ పత్రాలను తయారుచేసింది. ఆ తర్వాత వ్యాపారం చేయడానికి కావల్సిన సరుకులను టాక్స్(Tax) లేకుండా దిగుమతి చేసుకోవడానికి ఆ పత్రాలను ఉపయోగించింది. దీని తర్వాత మోనికా కపూర్, పోదరులు యూఎస్ పారిపోయారు. ఈమె చేసిన మోసానికి భారత ప్రభుత్వానికి(Indian Govt) దాదాపు రూ.5కోట్ల నష్టం వచ్చింది. దీంతో మోనికా కపూర్ పై 2004లో కేసు నమోదైంది.

Monika Kapoor: మోనికా కపూర్ కేసు సీబీఐ కస్టడీకి అప్పగింత

సీబీఐ అధికారులకు అప్పగింత..
అప్పటి నుంచి మోనికాను దర్యాప్తు రావాలని కోర్టు నోటీసులు పంపిస్తూనే ఉంది. కానీ ఆమె మాత్రం రాలేదు. దీంతో మోనికాను అప్పగించాలని 2010లో భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. ఆమెపై ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడూ ఆమెను అక్కడి నుంచి పంపడానికి ప్రయత్నించగా..ఇండియా తిరిగి వెళితే తనను అధికారులు హింసలకు గురి చేస్తారని..తిరిగి పంపొద్దంటూ మోనికా న్యూ యార్క్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇన్నాళ్ళూ కోర్టులో ఉన్న ఆ కేసును తాజాగా కోర్టు కొట్టివేయడంతో అమెరికాలోని అధికారులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. వీరు మోనికా కపూర్ ను ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం రాత్రికి ఆమెను అమెరికా నుంచి భారత్‌కు తీసుకురానున్నారు. భారత్‌- అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్‌కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది .

ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం అప్పగింత
భారత్‌కు తిరిగి వస్తున్న మోనికా కపూర్, భారత్-అమెరికా ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం, న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం రాత్రి సీబీఐ అధికారులు మోనికా కపూర్‌ను విమానంలో భారత్‌కు తరలించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Brazil: భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు

#telugu News CBI Custody India US Extradition Money Laundering Monika Kapoor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.