📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mohsen Fakhrizadeh: ఏఐ సాయంతో మొహసెన్ ఫఖ్రిజాదే హత్య

Author Icon By Shobha Rani
Updated: June 18, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఇజ్రాయెల్ క్షిపణుల దాడిలో ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ అధిపతి ఫెరిడౌన్ అబ్బాసీ (Mohsen Fakhrizadeh) మరణించడంతో 2020లో జరిగిన ఓ సంచలన హత్య ఘటన మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఇరాన్ (Iran) అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే (Mohsen Fakhrizadeh)హత్య. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
ఇరాన్ అణు శాస్త్రవేత్త ఫఖ్రిజాదే
మొహసెన్ ఫఖ్రిజాదే చాలా సంవత్సరాల పాటు అత్యంత రహస్య వ్యక్తిగా మిగిలిపోయారు. 2000వ దశకం ప్రారంభంలో ఇరాన్ రహస్యంగా అణుబాంబును నిర్మించడానికి చేపట్టిన “ప్రాజెక్ట్ అమాద్” వెనుక ఈయనే ముఖ్య సూత్రధారి అని పాశ్చాత్య నిఘా వర్గాలు భావించాయి. ఆయన బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు, ఆయన ఫోటోలు కూడా చాలా అరుదుగా లభ్యమయ్యేవి. పాశ్చాత్య నిఘా సంస్థలు, ఇజ్రాయెల్ అధికారులు ఫఖ్రిజాదేను “ఇరాన్ అణు కార్యక్రమ పితామహుడు”గా అభివర్ణించేవారు.

Mohsen Fakhrizadeh: ఏఐ సాయంతో మొహసెన్ ఫఖ్రిజాదే హత్య

2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్‌కు చెందిన అణు దస్త్రాలను బహిర్గతం చేస్తూ, ఫఖ్రిజాదే పేరును ప్రస్తావించి “ఈ పేరు గుర్తుంచుకోండి” అని వ్యాఖ్యానించారు. అప్పటినుంచే ఆయనకు ముప్పు పొంచి ఉందని స్పష్టమైంది.
బుల్లెట్లు – శరీరాన్ని చీల్చిన కాల్పులు
2020 నవంబర్ 27న మొహసెన్ ఫఖ్రిజాదే (Mohsen Fakhrizadeh) తన భార్య, బాడీగార్డులతో కలిసి టెహ్రాన్‌కు తూర్పున ఉన్న అబ్సార్డ్ పట్టణంలోని తమ విల్లాకు కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో, రోడ్డు పక్కన వదిలేసినట్లుగా ఉన్న ఓ పికప్ ట్రక్కులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 7.62 ఎంఎం ఎఫ్ఎన్ ఎంఏజీ మెషిన్ గన్‌ను అమర్చారు. దీనికి ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ లింకులు, పేలుడు పదార్థాలు కూడా జోడించారు. ఫఖ్రిజాదే కాన్వాయ్ ఒక స్పీడ్ బంప్ వద్ద వేగాన్ని తగ్గించగానే, ఆ మెషిన్ గన్ ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించింది.
దాక్కునే ప్రయత్నం చేసినా..
మొదట కారు ముందు భాగంలో బుల్లెట్లు తగలగా, రెండో రౌండ్ కాల్పుల్లో విండ్‌షీల్డ్ పగిలి, ఫఖ్రిజాదే (Mohsen Fakhrizadeh) భుజంలోకి కనీసం ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన కారు దిగి డోర్ వెనుక దాక్కునే ప్రయత్నం చేయగా, మరో మూడు బుల్లెట్లు ఆయన వెన్నెముకలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. మొత్తం 15 బుల్లెట్లు పేలగా, నిమిషం లోపే ఈ ఆపరేషన్ పూర్తయిందని ఇరాన్ అధికారులు తెలిపారు. అనంతరం ఆ ట్రక్కు పేలిపోయింది, కానీ ఆయుధాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంలో విఫలమైంది.
మొస్సాద్ ఆరోపణలు – గూఢచారి మాయాజాలం
ఈ మొత్తం ఆపరేషన్, నిఘా నుంచి హత్య వరకు, ఇజ్రాయెల్ విదేశీ గూఢచార సంస్థ మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత వహించనప్పటికీ, మొస్సాద్ మాజీ చీఫ్ యోస్సీ కోహెన్ తర్వాత కాలంలో ఫఖ్రిజాదే సరైన లక్ష్యమేనని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. నెలల తరబడి నిఘా పెట్టి, ఆయుధ భాగాలను రహస్యంగా ఇరాన్‌లోకి తరలించి, అక్కడే అమర్చి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఇరాన్ మరింత కఠిన వైఖరి అవలంబించింది, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
టెక్నాలజీతో హత్య: ఇది భవిష్యత్తు గూఢచారిత్వమా?

Read Also: Murder: నాన్నని చంపింది వాళ్ళే..సాక్ష్యం చెప్పిన కుమారుడు!

Breaking News in Telugu Google news Google News in Telugu IranNuclearScientist IsraelIranTensions Latest News in Telugu Mohsen Fakhrizadeh murdered MohsenFakhrizadeh MossadOperation Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news with the help of AI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.