📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Mohammed Siraj: బుమ్రా పై తన అభిమానాన్ని భావోద్వేగంతో వ్యక్తపరచిన సిరాజ్

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓవల్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ,చివరి టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరైతే, అది భారత అభిమానులకు మాత్రమే కాకుండా టీమిండియా బౌలింగ్ యూనిట్‌కి కూడా పెద్ద లోటుగా మారింది. బీసీసీఐ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి స్క్వాడ్‌ నుంచి రిలీజ్ చేయగా, సహచర పేసర్ మహ్మద్ సిరాజ్ తన మనసులో ఉన్న భావోద్వేగాలను మీడియాతో పంచుకున్నారు.మ్యాచ్ రెండో రోజున బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్, బుమ్రా (Bumrah) లేకపోవడం వల్ల ఎంతగా ఫీలయ్యాడో వివరించాడు. “బుమ్రా అన్న ఎప్పుడూ మాతో ఉంటారు. మైదానంలో ఆయన నుంచి వచ్చే మోటివేషన్ చాలా ముఖ్యమైనది. నేను ఒక బంతి తప్పుగా వేసినా వెంటనే వచ్చి సలహా ఇస్తారు. ఇప్పుడు ఆ గైడెన్స్ మిస్ అవుతున్నాను. అయినా కూడా, ఆయన ఇచ్చిన సూచనలు మైదానంలో గుర్తు చేసుకుంటూ బౌలింగ్ చేశాను,” అని సిరాజ్ చెప్పాడు.

కట్టడి చేయడంలో

జస్ప్రీత్ బుమ్రా ఓవల్ టెస్ట్ రెండో రోజు ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతమైన బౌలింగ్ చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఇంగ్లాండ్‌ను 247 పరుగులకు పరిమితం చేయగలిగింది.బీసీసీఐ విడుదల చేసిన ఒక వీడియోలో మహమ్మద్ సిరాజ్, బుమ్రాతో తన చివరి సంభాషణను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. “జస్సీ భాయ్‌కు నేను ఇలా చెప్పాను, ‘మీరు ఎందుకు వెళ్తున్నారు? నేను 5 వికెట్లు తీస్తే ఎవరిని కౌగిలించుకోవాలి?’ అని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు.

Mohammed Siraj:

ఐపీఎల్ కూడా కలిసే ఆడాం

దానికి బుమ్రా, ‘నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు 5 వికెట్లు తీసుకో’ అని అన్నాడని తెలిసింది. మా మధ్య జరిగిన సంభాషణ అంతే అని మహ్మద్ సిరాజ్ పంచుకున్నాడు. ఈ మాటలు వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, మైదానంలో వారి ఆప్యాయతను స్పష్టం చేస్తున్నాయి.మహమ్మద్ సిరాజ్‌తో పాటు ఈ ఇన్నింగ్స్‌లో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasiddh Krishna) కూడా 4 కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. భారత పేస్ బౌలింగ్ యూనిట్ మధ్య పెరుగుతున్న అద్భుతమైన సమన్వయం గురించి ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడాడు. ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ.. “సిరాజ్, నేను ఐదేళ్లుగా కలిసి ఆడుతున్నాము, ఐపీఎల్ కూడా కలిసే ఆడాం. మేము మైదానం బయట కూడా చాలా మాట్లాడుకుంటాం. ఆకాష్ దీప్‌తో కూడా అంతే – మా పేస్ బౌలింగ్ గ్రూప్ నిజంగా చాలా పదునుగా కనిపిస్తోంది. ఇది జట్టుకు గొప్ప సంకేతం” అని చెప్పాడు.

మొదటి ఇన్నింగ్స్‌

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తర్వాత భారత్ ఇంగ్లాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ చేసింది. 23 పరుగులతో వెనుకబడిన టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. బుమ్రా లేకపోయినా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్‌తో భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.

సిరాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం ఎప్పుడు చేశారు?

సిరాజ్ 2017లో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌తో భారత జట్టులో అరంగేట్రం చేశారు.

మొహమ్మద్ సిరాజ్ ప్రత్యేకత ఏమిటి?

సిరాజ్ తన వేగవంతమైన బంతులతో పాటు స్వింగ్ బౌలింగ్, అద్భుతమైన లైన్, లెంగ్త్ కంట్రోల్‌తో ప్రసిద్ధి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: 

https://vaartha.com/ind-vs-eng-rahul-fires-at-the-umpire-this-is-the-reason/international/524705/

BCCI update on Bumrah release Breaking News India vs England Oval Test 2025 Jasprit Bumrah rested for workload management latest news Mohammed Siraj emotional statement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.