📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mohammed Siraj: సిరాజ్‌కు ఐసీసీ భారీ జ‌రిమానా.. ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mohammed Siraj, భారత ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్టు మ్యాచ్‌లో ICC ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించబడి 15% మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని రికార్డులో జోడించబడింది.ఈ ఘటన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరవ ఓవర్లో చోటుచేసుకుంది. Siraj తన బౌలింగ్‌లో బెన్ డ‌కెట్ ను ఔట్ చేసిన తర్వాత అతని దిశగా వెళ్లి ఉత్సాహంగా అరిచాడు.ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని (Article 2.5) ఉల్లంఘనగా పరిగణించబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం, ఔటైన బ్యాట్స్‌మన్‌ను ఉద్దేశించి దురుసు భాష, సంకేతాలు, శారీరక చర్యలు చేయడం నిషిద్ధం. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స‌మ‌యంలో డ‌కెట్ 12 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. మూడ‌వ టెస్టు మ్యాచ్ ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. 193 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇండియా 4 వికెట్లు కోల్పోయి 58 ర‌న్స్ చేసింది. ఇవాళ అయిదో రోజు ఆట కీలకం కానున్న‌ది.

మ్యాచ్‌ నిషేధం

నాలుగో రోజు ఆట అనంతరం అంపైర్ల ఫిర్యాదుతో విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ రిఫరీ (Match Referee) ముందు సిరాజ్ తన తప్పిదాన్ని అంగీకరంచాడు. గత 24 నెలల్లో సిరాజ్‌ చేసిన రెండో తప్పిదమిది. ప్రస్తుతం అతను ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. రెండేళ్ల కాలంలో ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్స్ ఉంటే మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. సిరాజ్ ఖాతాలో మరో రెండు పాయింట్స్ చేరితే నిషేధం పడుతుంది. టెస్ట్‌ల్లో భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ (BCCI) రూ. 15 లక్షలు చెల్లిస్తోంది. ఇందులో రూ. 15 శాతం కోత అంటే రూ. 2.25 లక్షలు. అయితే ఇది భారత ఆటగాళ్లకు లెక్కే కాదని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు అంటున్నారు.

మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ కెరీర్ ఎప్పుడు మొదలైంది?

టీ20 డెబ్యూ – నవంబర్ 2017లో న్యూజిలాండ్‌తో,వన్డే డెబ్యూ – జనవరి 2019లో ఆస్ట్రేలియాతో,టెస్ట్ డెబ్యూ – డిసెంబర్ 2020లో ఆస్ట్రేలియాతో.

సిరాజ్ టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఏది?

2021లో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్ట్‌లో 5 వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టూర్‌లోనే తన తండ్రి మరణించినా దేశం కోసం ఆడటం కొనసాగించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: World Chimpanzee Day 2025: నేడు ప్రపంచ చింపాంజీ దినోత్సవం

Ben Duckett Breaking News ICC Code of Conduct ICC fine India vs England Lords Test 2025 Mohammed Siraj Siraj demerit points Telugu News Test match controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.