📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: ట్రంప్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న మోదీ

Author Icon By Vanipushpa
Updated: August 13, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ఆంక్షలు..ఆ వెంటనే అదనపు టారీఫ్ లతో భారత్ దోస్తీకి మంగళం పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇవి ఈ నెల 27 నుంచి అమలు కానున్నాయి. అయితే ఈ టారీఫ్ లను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి రష్యా, చైనా(Russia,China) లు తమ మద్దతు తెలిపాయి. అయితే భారత్ టారీఫ్ ల గురించి చర్చలకు రెడీగా వున్నా ..ట్రంప్ మాత్రం అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. మరోవైపు చైనాకు మాత్రం సుంకాలపై మరో 90 రోజులు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ట్రంప్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న మోదీ

యూఎస్ , భారత్ ల మధ్య నెలకున్న వాణిజ్య ఉద్రిక్తత
భారత ప్రధాని మోదీ(Modi) అమెరికా(America) పర్యటించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNO) సమావేశాలకు ఆయన హాజరుకానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అదనపు సుంకాలు, దాని వలన యూఎస్ , భారత్ ల మధ్య నెలకున్న వాణిజ్య ఉద్రిక్తత పరిష్కారానికి మోదీ..ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతే కాదు ఐరాస సమావేశాలకు హాజరయ్యే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో కూడా భారత ప్రధాని సమావేశం అవుతారు. రీసెంట్ గా వీరిద్దరూ ఫోన్ లో సంభాషించుకున్నారు. అప్పుడే కలిసి డైరెక్ట్ గా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశం జరగనుంది.
చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు
అయితే దీని కన్నా ముందు భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. మోదీ(Narendra Modi) షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఇప్పుడు ఈ సమావేశంలో ఇరు దేశాల సరిహద్దు వివాదాలు, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న చైనా

టారీప్ ల విషయంలో భారత్ కు చైనా సపోర్ట్ చేస్తోంది. భారత్ కన్నా ముందు ఈ అత్యధిక సుంకాలకు చైనా పెద్ద బాధిత దేశం. ఆ దేశంపై ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు ట్రంప్. వరుసగా రెండు సార్లు 90 రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఎప్పటికైనా చైనా వీటికి బలవ్వల్సిందే. అసలే అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న చైనా వీటిని ఒప్పుకోవడానికి ఏంత మాత్రం సిద్ధంగా లేదు. దీనికి తోడు ఇప్పడు భారత్, రష్యా వంటి దేశాలు కూడా యాడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ వరుసగా చైనా, యూఎస్ పర్యటనలు టారీఫ్ ల విషయంలో పెద్ద ఎఫెక్ట్ నే చూపించనుందని అంటున్నారు విశ్లేషకులు. పక్కా ప్లాన్ ప్రకారమే మోదీ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పెడతారని అంటున్నారు.

భారతదేశం మరియు చైనా మధ్య తాజా ఒప్పందం ఏమిటి?
2024 భారతదేశం-చైనా సరిహద్దు గస్తీ ఒప్పందం ఈ క్రింది లక్ష్యాలతో సంతకం చేయబడింది. సరిహద్దుపై నాలుగు సంవత్సరాల తేడాలను తగ్గించడం. వ్యాపార పరస్పర చర్యను సాధారణీకరించడం. క్లిష్టమైన ఘర్షణ పాయింట్ల వద్ద ఘర్షణను తగ్గించడం.
భారతదేశం మరియు చైనా మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం ఏమిటి?
పరస్పరం గుర్తించబడిన సరిహద్దు ఒప్పందాలు లేకపోవడం వలన ఉద్రిక్తతలు మరియు అప్పుడప్పుడు సైనిక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలలో మొదటిది, అక్సాయ్ చిన్, చైనా ఆధీనంలో ఉంది మరియు భారతదేశం దాని గురించి వాదిస్తోంది; ఇది ఎక్కువగా జనావాసాలు లేని ఎత్తైన బంజరు భూమి, కానీ అంచులలో కొన్ని ముఖ్యమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pakistan-pleads-india-for-indus-waters/international/529477/

Diplomacy Donald Trump India US relations International Politics Latest News Breaking News Narendra Modi Strategic Moves

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.