📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని మోదీ(PM Modi) ఐదు దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్‌(Brizil)లో పర్యటించారు. రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సు(Brics Summit)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదర్న్ క్రాస్ తో ప్రధాని మోదీని సత్కరించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని చేసిన కృషికి గానూ దీనిని ఆయనకు ప్రదానం చేశారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా దీనిని మోదీకి ప్రదానం చేశారు. దీని తరువాత మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్లమంది భారతీయులకూ గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలని అన్నారు. అన్ని వివాదాలనూ చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది తమ ఏకాభిప్రాయమని చెప్పారు. ఇలాంటి విదేశీ పురస్కారాలను ప్రధాని అందుకోవడం ఇది 26వసారి.

Modi: ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

ప్రధానికి ఘన స్వాగతం..
బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీకి రియో డీ జనీరో నుంచి బ్రెజిల్ కు వచ్చిన మోదీకి 114 అశ్వాల కవాతుతో స్వాగతం లభించింది. అలాగే అక్కడి కళాకారులు కూడా ఆయన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. దీని తర్వాత ఇరు ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలూ చర్చించుకున్నారు. పర్యావరణం, శుద్ధ ఇంధనం రెండు దేశాలకూ ప్రధానాంశాలని…రాబోయే ఐదేళ్ళల్లో వాణిజ్యాన్ని 2 వేల కోట్ల డాలర్లకు చేర్చడమే లక్ష్యమని చెప్పారు. రక్షణ రంగంలో ఇండియా, బ్రెజిల్ సహకారం మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ఇరు దేశాధినేతలు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఔషధాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై నేతలు చర్చించుకున్నారు. వీటికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ద్వైపాక్షిక చర్చలు – భారత్, బ్రెజిల్
పర్యావరణం & శుద్ధ ఇంధనం, ఇరు దేశాధినేతలు పర్యావరణ పరిరక్షణ, శుద్ధ ఇంధనంపై చర్చించారు. వాణిజ్య లక్ష్యం: $20 బిలియన్లు
రాబోయే ఐదేళ్లలో వాణిజ్యాన్ని $20 బిలియన్లకు (రూ. 1.66 లక్షల కోట్లు) పెంచే లక్ష్యాన్ని వారు ప్రకటించారు.
రక్షణ రంగ సహకారం
ఇండియా-బ్రెజిల్ మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఔషధ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి .

నరేంద్ర మోడీ ఎవరు?
నరేంద్ర దామోదర్దాస్ మోడీ (జననం 17 సెప్టెంబర్ 1950) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అతను 2014 నుండి భారతదేశ ప్రధాన మంత్రిగా పనిచేస్తున్నాడు.
నరేంద్ర మోడీ / భార్య (మ. 1968)
మోదీకి భార్య ఉందా?
జశోదాబెన్ నరేంద్రభాయ్ మోడీ (నీ చిమన్‌లాల్ మోడీ; జననం 1952) ఒక భారతీయ మాజీ పాఠశాల ఉపాధ్యాయురాలు మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విడిపోయిన భార్య. ఈ జంట 1968లో వివాహం చేసుకున్నారు, ఆమెకు దాదాపు 16 సంవత్సరాలు, మోడీకి 18 సంవత్సరాలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Texas: టెక్సాస్‌లో భారీ వరదలు: మృతుల సంఖ్య 100 దాటింది

Brazil BRICS Summit 2025 Clean Energy Defence Cooperation India-Brazil Relations Indian Prime Minister Awards International Diplomacy Lula da Silva Modi Foreign Visit Narendra Modi Southern Cross Award Trade Agreements

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.