📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

Author Icon By Vanipushpa
Updated: July 23, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు మాల్దీవుల(Maldives) వాణిజ్యం దెబ్బతింది.. పర్యాటకం కకలా వికలం అయ్యింది.. ఒకప్పుడు పర్యాటక(Tourism) సంపదతో బతికి బట్టకట్టిన దేశం.. ప్లీజ్ భారతీయులారా.. మా దేశాన్ని సందర్శించండి.. ఇకపై అలా అనడం.. అంటూ ప్రాథేయపడింది.. అలా అన్న దేశం ఏదో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది.. ఆ దేశం ఏదో కాదు మాల్దీవులు.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చేసిన వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం దుమారం రేపాయి.. ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరించిన తీరు.. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది.. చివరకు మా దేశంలో పర్యటించండి అనేస్థాయికి మాల్దీవులు దిగజారేలా చేసింది.

మోదీ మాల్దీవుల పర్యటిస్తుండటం ప్రాధాన్యత
ఆ తర్వాత క్రమంగా చైనాతో దగ్గరగా ఉండే.. మాల్దీవుల దేశం భారత్ తో బంధాలను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు భారత్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయి.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చి మరి తమ దేశంలో పర్యటించాలని కోరారు.. దీంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాల్దీవుల పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.. చైనా అనుకూలుడిగా కనిపించే మొహమ్మద్ ముయిజు 2023 నవంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేయడం.. ఇదే సమయంలో ప్రధానమంత్రి మాల్దీవుల పర్యటించడం కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.

Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

జూలై 25, 26 తేదీలలో జరిగే మాల్దీవుల పర్యటన
ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు.. నాలుగు రోజులపాటు యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల్లో పర్యటించనున్నారు.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ బ్రిటన్‌కి నాలుగోసారి, మాల్దీవులకు మూడోసారి వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు UKకి వేళ్తారు.. ఈ పర్యటనలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి మాల్దీవులకు వెళతారు.. జూలై 25, 26 తేదీలలో జరిగే మాల్దీవుల పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది..

అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు

దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆతిథ్యం ఇస్తున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీ నిలవనున్నారు. 2023 చివరలో “ఇండియా అవుట్” ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిజు ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించేలా ప్రణాళిక
“ఇండియా అవుట్” ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిజు కొన్ని విధానాల కారణంగా భారతదేశం-మాల్దీవులు సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు మాల్దీవులతో సంబంధాలు తెగిపోయాయని.. ప్రచారం చేశాయి. కానీ.. మోదీ ప్రభుత్వం ద్వీప దేశానికి చురకలంటిస్తూనే.. దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించేలా ప్రణాళికను రచించింది. ఆ ఆ “సంబంధాలను ప్రభావితం చేసే లేదా మళ్లీ ప్రయత్నించే సంఘటనలు ఎల్లప్పుడూ ఉంటాయి” అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మంగళవారం మీడియా సమావేశంలో అంగీకరించారు.

మాల్దీవులకు సాయం..
మాల్దీవుల మధ్య నావికా విన్యాసాలు సహా బలమైన రక్షణ, భద్రతా సహకారం ఉన్నందున, భారతదేశం దాని రక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా మాల్దీవులకు సహాయం చేస్తూనే ఉంది. “మాల్దీవులు సంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం వారికి కీలకమైన దేశంగా ఉంది. “మాల్దీవులు సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా వారి అవసరాలకు మేము ఎల్లప్పుడూ ముందుగా స్పందిస్తాము… బలమైన రాజకీయ సంబంధం ఉంది… ఉన్నత స్థాయిలలో క్రమం తప్పకుండా సందర్శనల ద్వారా ఇది బలపడింది” అని మిస్రి అన్నారు .

మాల్దీవులు దేనికి ప్రసిద్ధి చెందాయి?
మాల్దీవుల గురించి 10 వాస్తవాలు - ప్రామాణిక భారత పర్యటనలు
మాల్దీవులు దాని అద్భుతమైన సహజ సౌందర్యానికి, ముఖ్యంగా దాని సహజమైన బీచ్‌లు, స్ఫటిక-స్పష్టమైన టర్కోయిస్ జలాలు మరియు శక్తివంతమైన పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందింది.
భారతీయులకు మాల్దీవులు ఎలా ఉన్నాయి?
మాల్దీవులు భారతీయ ప్రయాణికులను ఉచిత 30 రోజుల వీసా ఆన్ అరైవల్‌తో స్వాగతిస్తుంది. అందుకే మాల్దీవులు ఇబ్బంది లేని విహారయాత్ర. మీరు ప్రధాన భారతీయ నగరాల నుండి మాలే విమానాశ్రయానికి నేరుగా విమానాలను బుక్ చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

#telugu News India Maldives Relations Latest News Breaking News Maldives Diplomacy Modi Foreign Visit Modi South Asia Tour Narendra Modi News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.