అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వైట్ హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొని భారత ప్రజలకు, భారతీయ-అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు దీపావళి ప్రారంభోపన్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని ప్రశంసించారు. ఆయనను గొప్ప వ్యక్తిగా వర్ణించారు. తనకు గొప్ప స్నేహితుడని చెప్పారు. అదే సమయంలో వాణిజ్యం, ప్రాంతీయ శాంతిలో అమెరికా- భారత్ సంబంధాలను ప్రస్తావించారు.
Read Also: NITI: ‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు
వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం: ట్రంప్
“భారత ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజే మీ ప్రధానమంత్రితో మాట్లాడాను. చాలా బాగా మాట్లాడాను. మేం వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. పాకిస్థాన్‌తో యుద్ధాలు వద్దని కొంతకాలం క్రితం మనం మాట్లాడుకున్నప్పటికీ, వాణిజ్యం ఇమిడి ఉండటంతో నేను దాని గురించి మాట్లాడగలిగాను. పాకిస్థాన్, భారత్ మధ్య ఇప్పుడు యుద్ధం లేదు. అది చాలా మంచి విషయం” అని ట్రంప్ అన్నారు. మోదీ గొప్ప వ్యక్తి, కొన్ని సంవత్సరాలుగా తనకు గొప్ప స్నేహితుడని చెప్పారు. అంతకుముందు పండుగ ప్రాముఖ్యం కోసం మాట్లాడారు ట్రంప్. కొన్ని క్షణాల్లో తాను చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయాలకు చిహ్నంగా దీపాన్ని వెలిగిస్తానని చెప్పారు.
దీపాలు వెలిగించిన ట్రంప్
ఈ కార్యక్రమంలో ట్రంప్ యంత్రాంగంలోని భారత సంతతి అధికారులైన FBI డైరెక్టర్ కాష్ పటేల్, ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పండుగను జరుపుకోవడానికి దీపాలను వెలిగించారు ట్రంప్.
ఇటీవల దీపావళి మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, బ్రియాన్ ఫిట్జ్‌పాట్రిక్ అమెరికా ప్రతినిధుల సభలో ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పత్రికా ప్రకటన ప్రకారం, ఈ తీర్మానం హిందువులు, జైనులు, సిక్కులు సహా మూడు మిలియన్లకు పైగా భారతీయ-అమెరికన్లకు దీపావళి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యాన్ని గౌరవిస్తుంది. ఇది అమెరికాకు భారతీయ ప్రవాసుల సహకారాలకు పెరుగుతున్న గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
నాలుగు సంవత్సరాలు, మరియు ఒక వ్యక్తి రెండుసార్ల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదు. ఇది 1951లో ఆమోదించబడిన అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. ఒకవేళ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మరొకరి పదవీకాలంలో రెండేళ్ళ కంటే ఎక్కువ పనిచేస్తే, ఆ వ్యక్తిని ఒకసారి మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు.
మోడీ ఎన్ని సార్లు ప్రధాని అయ్యారు?
2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: