📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Modi Govt​ : అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోదీ సర్కార్: కాంగ్రెస్ ఆరోపణ

Author Icon By Shobha Rani
Updated: May 17, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్​కు ఐఎంఎఫ్ (IMF)రుణం మంజూరు విషయంలో మోదీ సర్కార్​ ‘అమెరికా ఒత్తిడికి తలొగ్గింది’ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్థాన్​కు రుణాలు మంజూరు చేసే అంశంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) (IMF) పునరాలోచన చేయాలని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ కోరిన ఒక రోజు తరువాత కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
భజనలు కాదు.. భారత్‌కు నో ఓటు అవకాశం ఉంది – జైరామ్ రమేశ్
ఐఎంఎఫ్​ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో పాకిస్థాన్​కు రుణాలు మంజూరు చేయడంపై చర్చ జరుగుతున్నప్పుడు మోదీ సర్కార్​ అమెరికా ఒత్తిడికి తలొగ్గింది. అందుకే మే 9న ఐఎంఎఫ్ (IMF) మీటింగ్​కు భారత్​ గైర్హాజరయ్యింది. మోదీకి ఎప్పుడూ భజనలు చేసేవాళ్లు, చీర్​ లీటర్లు భారత్​కు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఇదేనని చెప్పారు. కానీ అది పూర్తిగా అబద్ధం. ఎగ్జిక్యూటివ్ బోర్డ్​లో ‘నో ఓటు’ వేయడానికి అవకాశం ఉంది. 2016 సెప్టెంబర్​లో ఉక్రెయిన్​కు రుణం మంజూరు ప్రతిపాదన వచ్చినప్పుడు రష్యా నో ఓటు హక్కును వినియోగించుకుంది. 2005 సెప్టెంబర్​ 11న జింబాబ్వే బహిష్కరణ అంశంపై భారత్ కూడా నో ఓటు వేసింది. ఏదేమైనా, సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది. కానీ మోదీ సర్కార్​, పాక్​కు రుణాలు మంజూరు చేయడానికి ఐఎంఎఫ్ తీర్మానించినప్పుడు మిన్నకుండిపోయింది. కానీ ఇప్పుడు రాజ్​నాథ్ సింగ్ దాని గురించి పునరాలోచన చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది.

Modi Govt​ : అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోదీ సర్కార్: కాంగ్రెస్ ఆరోపణ

ఉగ్రవాదానికి ఊతమిచ్చే నిధులపై ఆందోళన
మే 9న వాషింగ్టన్​లో జరిగిన బోర్డ్ సమావేశంలో ఐఎంఎఫ్​ పాకిస్థాన్​కు 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన భారత్​, ఇస్లామాబాద్ సదరు నిధులను ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలకు తగినంత నిధులు సమకూర్చుకోవడానికి వినియోగించవచ్చని పేర్కొంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ మంజూరు చేసిన $1 బిలియన్‌ రుణం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.ఈ నిధులు మురిద్కే, బహావల్పూర్‌లో ఉన్న ఉగ్ర సంస్థలకు మౌలిక సదుపాయాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని భారత్ పేర్కొంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు పునరుద్ధరించబడే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.
రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
గుజరాత్​లోని భుజ్​ వైమానిక స్థావరాన్ని సందర్శించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, అక్కడి యోధులతో ముచ్చటించారు. పాక్​కు ఐఎంఎఫ్​ ఆర్థిక సాయం అందించకూడదని పేర్కొన్నారు. ఒక వేళ అలాంటి సాయం ఏదైనా చేస్తే ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ‘ముఖ్యంగా మురిద్కే, బహవాల్పూర్​ల్లో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్​ ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాక్ ఐఎంఎఫ్​ నిధులు వాడుకునే అవకాశం ఉంది’ అని రాజ్​నాథ్​ సింగ్ అన్నారు.ఐఎంఎఫ్–పాకిస్థాన్ రుణం అంశం భారత్‌లో రాజకీయం వేడెక్కిన మరో ఉదాహరణ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన వైఖరిని ప్రకటించిన మోదీ ప్రభుత్వం, అదే సమయంలో అంతర్జాతీయ వేదికల్లో ఎందుకు చురుకైన పాత్ర పోషించలేకపోయిందనే సవరణలు కాంగ్రెస్ తరపున వచ్చాయి. ఇది కేవలం ఓ వాణిజ్య తీర్మానమే కాకుండా జాతీయ భద్రత, దౌత్య వ్యూహాల సమస్యగా మారుతోంది.

Read Also: Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. తప్పిన ప్రాణాపాయం!

American pressure Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Modi Sarkar bowed down to Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.