📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ ట్రంప్‌కు చెప్పారా?

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలు చేయబోమంటూ తమ మధ్య జరిగిన ఫోన్‌కాల్‌లో ప్రధాని మోదీ(Modi) హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆ ఫోన్‌కాల్ గురించి తమకు ”తెలియదని” భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తామని భారత్ ”ఈరోజు నాకు హామీ ఇచ్చింది” అని బుధవారం ట్రంప్ ప్రకటించారు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి క్రెమ్లిన్‌పై పెంచుతున్న ఆర్థిక ఒత్తిడిలో ఇదొక ముందడుగు అని ఆయన చెప్పారు. అయితే గురువారం నాడు ట్రంప్ ఫోన్‌కాల్ విషయాన్ని ప్రస్తావించగా, భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ట్రంప్ చెప్పిన మాటలపై సందేహం వ్యక్తం చేశారు.అంతకు ముందురోజు ఇరువురి నేతల మధ్య జరిగినట్లుగా ట్రంప్ చెబుతున్న ఈ ఫోన్ కాల్ గురించి తనకు తెలియదన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికాతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని భారత ప్రభుత్వం ఇంతకుముందు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని వైట్‌హౌస్ అధికారి ఒకరు చెప్పారు.

Read Also: Pakistan : యుద్ధానికి మేం సిద్ధం.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు

రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ ట్రంప్‌కు చెప్పారా?

భారత్ పై ట్రంప్ దౌత్యపరమైన ఒత్తిడి

రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం రష్యాకు కీలకమైన ఇంధన కొనుగోలుదారుగా మారింది. దీంతో యుక్రెయిన్ మిత్రదేశాలు, రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించడంవల్ల కలిగిన ప్రభావాన్ని రష్యా పాక్షికంగా తట్టుకోగలుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం క్రెమ్లిన్‌ను ఆర్థికంగా బలహీనపరచడానికి, యుద్ధానికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నందున, రష్యా ఇంధన మార్కెట్‌కు అండగా నిలవొద్దంటూ భారత్‌పై బహిరంగంగా, దౌత్యపరమైన ఒత్తిడి తీసుకువచ్చింది. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించింది. ఇండియా ‘త్వరలోనే’ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని మోదీ నుంచి హామీ వచ్చిందని ట్రంప్ ఇటీవల చెప్పారు.

భారత్ వివరణ ఏమిటి?

ట్రంప్, మోదీల మధ్య ఫోన్ సంభాషణ జరిగిన విషయాన్ని భారత ప్రభుత్వం నేరుగా స్పందించలేదు. “అస్థిరమైన ఇంధన పరిస్థితుల దృష్ట్యా భారతీయ వినియోగదారులు ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయి. మా దిగుమతి విధానాలన్నీ దీనిని దృష్టిలో పెట్టుకునే నిర్దేశితమై ఉంటాయి” అని పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం గురువారం రెండోసారి స్పందించిన తీరు దిల్లీ,వాషింగ్టన్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే ప్రశ్నలను లేవనెత్తింది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు ముడిచమురు కొనుగోలు చేయడంపై ఆధారపడుతున్న న్యూదిల్లీ వైఖరి, ట్రంప్ పరిపాలనలో అమెరికా, భారత సంబంధాలలో సంక్లిష్టమైన అంశంగా మారింది.

భారత్‌లో ప్రముఖ చమురు శుద్ధిసంస్థపై ఆంక్షలు

రష్యా చమురును ప్రపంచ మార్కెట్లకు చేరవేసేందుకు సహకరిస్తోందనే కారణంతో భారత్‌లో ప్రముఖ చమురు శుద్ధిసంస్థపై ఆంక్షలను విధించబోతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. నయారా ఎనర్జీ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ 2024 లోనే రష్యా నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుందని, దాని విలువ 5 బిలియన్ డాలర్లు (4.15 లక్షల కోట్లరూపాయలు)కు పైగానే ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Diplomacy Donald Trump Energy Policy Global Trade India-US Relations Latest News Breaking News Narendra Modi Oil Imports Russian oil Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.