📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Missing : పెళ్లి కోసం అమెరికా వెళ్లి మిస్సింగ్!

Author Icon By Sudheer
Updated: June 30, 2025 • 10:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల (Indians) పరిస్థితిపై మరోసారి ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. తాజాగా పెళ్లి కోసం అమెరికా వెళ్లిన సిమ్రన్ (24) (Simran ) అనే భారత యువతి న్యూజెర్సీలో అదృశ్యమైంది. ఈ నెల 20న ఆమె అమెరికాలో న్యూజెర్సీకి చేరుకోగా, ఐదు రోజుల తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. ఈ సంఘటనతో అక్కడి పోలీసులు, ప్రవాస భారతీయులు అప్రమత్తమయ్యారు.

సీసీకెమెరాలో చివరిసారిగా కనిపించిన సిమ్రన్

సిమ్రన్ చివరిసారిగా ఒక చోట ఫోన్లో చూస్తూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా సీసీకెమెరాలో కనిపించింది. తర్వాత ఆ మార్గం గుండా ఎక్కడికి వెళ్లిందో తెలియకపోవడం పోలీసులు మరియు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. మరింత విచారణ చేస్తుండగా, ఆమెకు ఇంగ్లిష్ భాష రాదని, స్థానికులతో సరైన సంప్రదింపు జరగకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం దొరకకపోవడంతో గల్లంతైన కేసుగా నమోదు చేశారు.

కుటుంబ సభ్యులు కంగారు – పెళ్లి కోసమే అమెరికా ప్రయాణం

సిమ్రన్ కుటుంబ సభ్యులు ఆమెను సంప్రదించేందుకు తిరితిరిగా ప్రయత్నిస్తున్నా, ఫలితం లేకుండా పోతోంది. ఆమె పెళ్లి సంబంధాల కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో అమెరికాలో భారతీయ మహిళల గల్లంతు కేసులు పెరిగిపోతున్నాయని, అధికార యంత్రాంగం మరింత దృష్టిసారించాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. భారత కాన్సులేట్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Read Also : Chandrababu : రేపు తూ.గో. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Google News in Telugu india missing girl simran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.