📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Miss Universe : విశ్వసుందరి పోటీల్లో హైడ్రామా

Author Icon By Sudha
Updated: November 6, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయ్‌లాండ్‌ లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది. ఈ వివాదం మొత్తం ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ కావడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మిస్‌ యూనివర్స్ (Miss Universe)పోటీల్లో పాల్గొన్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్‌కు హాజరుకాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్‌ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్‌.. ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివితక్కువ మనిషి అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించారు. దాంతో ఆమె ఎదురుతిరిగారు.

Read Also : http://Gold lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

Miss Universe

‘మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేం మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి’ అని తీవ్రంగా స్పందించారు. ‘ముందుగా నా మాట విని, ఆ తర్వాత వాదించండి’ అంటూ నవాత్ బదులిచ్చారు. ఆ విధంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఫాతిమాతోపాటు మరికొన్ని దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు వేదిక నుంచి వాకౌట్ చేశారు. తర్వాత ఆమె బయటకు వచ్చి తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ వ్యవహారం ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. నవాత్‌పై విమర్శలు వ్యక్తం కావడంతో ఆ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీనిపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

మిస్ యూనివర్స్ బహుమతి డబ్బు ఎంత?

మిస్ యూనివర్స్ బహుమతి ప్యాకేజీలో గణనీయమైన వార్షిక జీతం మరియు ఇతర బహుమతులు ఉంటాయి, కానీ ఖచ్చితమైన నగదు బహుమతికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇటీవలి విజేతలు న్యూయార్క్ నగరంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్, ఒక కిరీటం (మిలియన్ల విలువైనదిగా అంచనా వేయబడింది) మరియు వారి సంవత్సరం పొడవునా ప్రయాణ ఖర్చులను పూర్తిగా చెల్లించడంతో పాటు వార్షిక జీతంగా సుమారు USD $250,000 అందుకున్నారు. టైటిల్ హోల్డర్ మానవతా కారణాల కోసం వాదించడానికి, మీడియా శిక్షణ పొందడానికి మరియు వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నెట్‌వర్క్‌లను నిర్మించడానికి విస్తృతమైన అవకాశాలను కూడా పొందుతారు.

భారతదేశపు తొలి మిస్ యూనివర్స్ ఎవరు?

31 సంవత్సరాల క్రితం, సుష్మితా సేన్ తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు … భారతదేశపు తొలి మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, ఆమె 1994లో ఈ టైటిల్ గెలుచుకుంది. ఆమె విజయం తర్వాత, ఆమె బాలీవుడ్‌లో విజయవంతమైన కెరీర్‌ను ప్రారంభించింది మరియు ఒంటరి తల్లిగా ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకున్నందుకు కూడా ప్రసిద్ధి చెందింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Beauty Pageant Breaking News Controversy Fashion high drama latest news Miss Universe Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.