Milan Cortina Olympics 2026: హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’

Read Time:  1 min
Milan Cortina Olympics 2026: హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’
FONT SIZE
GET APP

Milan Cortina Olympics 2026: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రీడారంగంలో దేశ ప్రతిష్టను పెంచిన గోల్‌కీపర్ కొన్నార్ హెల్లిబక్‌పై ప్రశంసలు కురిపించారు. మిలాన్ కోర్టినా ఒలింపిక్స్‌లో పురుషుల ఐస్ హాకీ ఈవెంట్‌లో అమెరికాకు చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని అందించినందుకు గుర్తుగా, అతనికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ (Presidential Medal of Freedom) అందజేయనున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

Read Also: America: నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

Milan Cortina Olympics 2026: Hockey goalkeeper Connor Hellibuck to receive ‘Medal of Freedom’
Milan Cortina Olympics 2026: Hockey goalkeeper Connor Hellibuck to receive ‘Medal of Freedom’

గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో అద్భుతం: 41 గోల్స్‌ను అడ్డుకున్న హెల్లిబక్

కెనడాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో హెల్లిబక్ ఒక గోడలా నిలబడి అమెరికాను గెలిపించాడు. గోల్‌కీప‌ర్‌గా అత‌ను 41 గోల్స్‌ను సేవ్ చేశాడు. దీంతో మ్యాచ్ 1-1తో టై అయ్యింది. అయితే ఆ త‌ర్వాత జాక్ హ్యూగ్స్ ఓ గోల్ స్కోరు చేయ‌డంతో అమెరికా స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్న‌ది. సెకండ్ హాఫ్‌లో త‌న స్టిక్‌తో హెల్లిబ‌క్ గోల్‌ను ఆప‌డం మ్యాచ్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌గా మారింది. ఒక‌వేళ ఆ గోల్‌ను సేవ్ చేయ‌కుంటే, అప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. ఐస్ హాకీలో చాన్నాళ్ల త‌ర్వాత అమెరికా జ‌ట్టు గోల్డ్ మెడ‌ల్‌ను సాధించింది. దీంతో ప్ర‌స్తుతం అమెరికా జ‌ట్టుపై ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.