అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్(Trump)కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్ మిగిలిన రెండేళ్ల పాలనను శాసించనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ గత రెండేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్‌లు పెంచడం లాంటి నిర్ణయాలు దుమారం రేపాయి. అయితే ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గతేడాది అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేశారు.
Read Also: NASA: ల్యాండింగ్ గేర్ లోపంతో విమానం వెనుక భాగంలో మంటలు
ప్రతి రెండేళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు
అమెరికాలో అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. కానీ ప్రతి రెండేళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. వీటినే ‘మిడ్‌టర్మ్ ఎలక్షన్స్’ అని అంటారు. అమెరికా పార్లమెంటునే కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్‌లో రెండు సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇవి మొత్తం 435 స్థానాలు ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం రెండేళ్లు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరగుతాయి. ఇక రెండవది ఎగువ సభ. ఇందులో ఉండేవాళ్లని సెనేటర్లు అని పిలుస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు. సెనేటర్ల పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: