📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Micro Burst: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మైక్రో బరస్ట్

Author Icon By Anusha
Updated: August 14, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆకాశం నుంచి నది ప్రవాహం తరహాలో మహాకుంభవృష్టి

హైదరాబాద్ : పర్యావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడడం తెలిసిందే. ఎల్ నినో, లానినో ఇందులో భాగంగా వచ్చినవే. కొన్నిచోట్ల విపరీతమైన వర్షాలు, ఇంకొన్ని చోట్ల అతి తీవ్రమైన కరువు ఏర్పడడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల క్లౌడ్ బరస్ట్ (మేఘ విచ్చిత్తి)లు కూడా భారత్ సహా పలు దేశాలను వణికిస్తున్నాయి. అరగంట నుంచి గంట వ్యవధిలో 15 నుంచి 30 సెంటిమీటర్ల వర్షం కురవడం క్లౌడ్ బరస్ట్ ప్రత్యేకత. అయితే క్లౌడ్ బరస్ట్కు మించిన మైక్రో బరస్ట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్లో కొన్ని నెలల క్రితం మైక్రో బరస్ట్ కారణంగా వున్నట్లుండి పెద్ద మేఘం సుడిగాలి తరహాలో నదీ ప్రవాహం మాదిరిగా ఒక్క ఉదుటున ఊడి, పడి ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది.

మైక్రో బరస్ట్ అంటే ఏమిటీ?

భూకంపం సమయంలో సముద్రం లో ఏర్పడే సునామిల తరహాలో నీరు ఒక్కసారిగా ఊళ్లను ముంచెత్తినట్లు మైక్రో బరస్ట్ వల్ల మహా కుంభవృష్టి ఆస్టిన్ను అమాంతం మొన్న ఉత్తం ఖండ్లోని దరాళినికబళించినట్లు తుడిచి పెట్టింది. మైక్రో బరస్ట్ అంటే ఏమిటీ? ఇంతకు మైక్రో బరస్ట్ అంటే ఏమిటనేది ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తలతో (Meteorologists) పాటు సామాన్యులను కలవరపరుస్తోంది. క్లౌడ్ బరస్ట్ వల్ల 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో గంట వ్యవధిలో పది నుంచి 20 లేదా అంతకు మించిన వర్షపాతం నమోదవుతుంది. కానీ మైక్రో బరస్ట్ అలా కాదు. శక్తివంతమైన ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి బలమైన నిలువు ప్రవాహంలో భూమి వైపుకు తోసుకువస్తుంది. ఈ సుడిగాలి తనతో పాటు మేఘంలో వున్న నీటిని కూడా అత్యంత వేగంగా కిందకు లాగేస్తుంది.

Micro Burst

శాస్త్రజ్ఞులు మైక్రో బరస్ట్ గా నామకరణం చేశారు

దీంతో సాధారణ వర్షం మాదిరిగా చినుకులుగా కాకుండా భారీ నీటి స్తంభంలా ఆకాశం నుంచి ఓ నది భూమిపైకి జారి పడి పోయిందా? అన్నట్లుగా పరిస్థితి వుంటుంది. మేఘాలను తోసుకుంటూ వచ్చే వేగమైన గాలి ప్రవాహం భూమిని తాకినపుడు అది నక్షత్ర ఆకారంలో అన్ని దిశలకు వ్యాపిస్తుంది. దీనినే శాస్త్రజ్ఞులు మైక్రో బరస్ట్ (Micro Burst) గా నామకరణం చేశారు. ఈ ప్రక్రియలో గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు ఏర్పడతాయి. మైక్రో బరస్ట్లు అమెరికాలో ఏర్పడే టొర్నాడోలా ఒకేలా కనిపించినా వీటిలో తేడాలుంటాయి, టోర్నాడోలో గాలి సుడిగుండంలా తిరుగుతూ అవి,ఏర్పడిన చోటే నష్టాన్ని కలిగిస్తాయి. కానీ మైక్రో బరస్ట్లు గాలి నేరుగా భూమిని చేరి అన్ని దిశలకు వ్యాపించి అతి భారీ నష్టంచే కూరుస్తుంది. 2024లో అమెరికాలోని టెక్సాస్లో గల ఆస్టిన్లో ఏర్పడ్డ మైక్రో బరస్ట్ భారీ నష్టాన్ని మిగిల్చింది.

మేరీ ల్యాండ్లో గల ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో

అంతకు ముందు 2020లో ఆస్ట్రే లియాలోని పెర్త్లోనూ ఇలాంటి మహా కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. ఆకాశం నుంచి వర్షం సునామీలా భూమిపై పడినట్లుగా అప్పటి దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వై రల్ అవుతున్నాయి. వాస్తవానికి మైక్రో బరస్ట్ 1983లో అమెరికాలోని మేరీ ల్యాండ్లో గల ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ సమయంలో ఇక్కడ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. దీని తరువాత 198 4లో అమెరికాలోని సౌత్ డకోటా రొవెనాలోనూ సంభవించి తీవ్ర నష్టాన్ని కలిగిం చింది. ఈ సమయంలో ఇక్కడ గాలి 257 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక భారత్లో కూడా కొన్నేళ్లుగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తుండంతో రాబోయేరోజుల్లో క్లౌడ్ బరస్ట్ల స్థానంలో మైక్రో బ రస్ట్లు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మైక్రో బర్స్‌ట్ ఎప్పుడు ఏర్పడుతుంది?

ఎక్కువగా ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కురిసే సమయంలో, ప్రత్యేకంగా వర్ష మేఘాల కింద ఉన్న గాలిలో భారీ చల్లదనం ఏర్పడినప్పుడు.

దీని ప్రభావం ఎంత ప్రమాదకరం?

మైక్రో బర్స్‌ట్ గాలివేగం గంటకు 160 కి.మీ. వరకు చేరుతుంది. ఇది విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలా ప్రమాదకరం. భవనాలు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/washington-sundar-ben-stokes-overconfidence-led-to-englands-defeat-says-sundar/international/530140/

Breaking News cloud burst el nino environmental changes global weather changes Heavy Rains hyderabad india la nina latest news Natural Disaster severe drought Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.