📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Michael Vaughan: శుభ్‌మన్ గిల్ తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ప్రదర్శనపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా, తొలి రెండు రోజుల ఆట అనంతరం టీమిండియా వెనుకంజలో పడిపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు పుంజుకోవాలంటే, ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన నాయకత్వాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) పేర్కొన్నారు.మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మాట్లాడుతూ మైఖేల్ వాన్, “ఇది ఓ కీలక దశ. టీమిండియా ఇప్పటికైనా దూకుడుతో ఆడాలని, కెప్టెన్సీలో స్పష్టత చూపాలని” సూచించారు. శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) నాయకత్వంలో జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇంగ్లండ్ మాత్రం బాజ్‌బాల్ మైండ్‌సెట్‌తో బ్యాటింగ్‌ చేస్తూ ఒక్క సెషన్‌లోనే 148 పరుగులు సాధించింది. ఇది టీమిండియాకు బాగా తలనొప్పిగా మారింది.

శుభ్‌మన్‌ గిల్ విరాట్ కోహ్లీ మైండ్ సెట్‌తో రావాలి

వాన్ వ్యాఖ్యానిస్తూ,రెండో రోజు ఆట అనంతరం శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ‌పై మాట్లాడిన మైఖేల్ వాన్, ఇలా అయితే కష్టమని చెప్పాడు. మైదానంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పుంజుకోవాలంటే టీమిండియా తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి. శుభ్‌మన్‌ గిల్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైండ్ సెట్‌తో రావాలి. మూడో రోజును ఆటను గెలవాలనే కసితో ఆడాలి. మూడో రోజు ఆటలో భారత్ గెలిస్తే, ఈ మ్యాచ్ సజీవంగా ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అలా కాకుండా మూడో రోజు చేతులెత్తేస్తే మాత్రం మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా చేజారుతుంది.’అని మైఖేల్ వాన్ హెచ్చరించాడు.ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(100 బంతుల్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. క్రీజులో ఓలిపోప్(16 బ్యాటింగ్)తో పాటు జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నాడు.

హాఫ్ సెంచరీలతో

భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షూల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.అంతకుముందు 264/4 ఓవర్‌‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.

మైఖేల్ వాన్ కెరీర్ ఏమిటి?

మైఖేల్ వాన్ (Michael Vaughan) ఒక ఇంగ్లండ్ క్రికెట్ కామెంటేటర్‌ మరియు మాజీ క్రికెటర్‌. అతడు క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్‌లలో ఆడాడు. 2003 నుండి 2008 వరకు టెస్టు జట్టుకు, 2003 నుండి 2007 వరకు వన్డే జట్టుకు ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేశాడు. అలాగే 2005 నుండి 2007 వరకు ఇంగ్లండ్ తొలి ట్వెంటీ20 కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత, మైఖేల్ వాన్ కామెంటేటర్‌గా ప్రసిద్ధి గాంచాడు.

ప్రస్తుతం మైఖేల్ వాన్ ఏమి చేస్తున్నాడు?

ఇంగ్లండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) ప్రస్తుతం పేచెక్ కంప్లయిన్స్ అథారిటీ (Payroll Compliance Authority – PCA) అనే లాభాపేక్షలేని సంస్థకు అంబాసిడర్‌గా (దౌత్యవేత్తగా) పనిచేస్తున్నారు.

Read Hindi News: hindi.vaartha.com

Read Also: Ravi Shastri: క్రికెటర్ లెజెండరీ ల సంపాదన 100 కోట్ల పైనే అంటున్న రవి శాస్త్రి

Bazball strategy Breaking News England batting fourth Test 2025 India vs England latest news Manchester Test Michael Vaughan Comments Shubman Gill Captaincy Team India Performance Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.