📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Mexico: మెక్సికో టారిఫ్స్ తో ఇండియాకు భారీ నష్టం!

Author Icon By Vanipushpa
Updated: December 12, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ వాణిజ్యంపై మెక్సికో (Mexico) కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించింది. ఇప్పుడు దాని దారిలోనే మెక్సికో కూడా నడుస్తోంది. తమ దేశీయ పరిశ్రమలు, ఉత్పత్తిదారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో 2026 సంవత్సరం నుండి భారతదేశం, చైనా, ఇతర ఆసియా దేశాల నుండి వచ్చే దిగుమతులపై మెక్సికో ఏకంగా 50% వరకు భారీ సుంకాల పెంపును ఆమోదించింది. మెక్సికో సెనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు.. మెక్సికోతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుండి వచ్చే సుమారు 1,400 ఉత్పత్తుల శ్రేణులపై దిగుమతి సుంకాలను పెంచుతుంది.

Read Also: PM Modi : 3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

Mexico

మెక్సికో ప్రభుత్వం వాదన ఏమిటి?

ఏ ఉత్పత్తులు ప్రభావితమవుతాయి? మెక్సికో విధించిన ఈ కొత్త సుంకాలు దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై పడనున్నాయి. ముఖ్యంగా, ఆటో విడిభాగాలు, లైట్ వాహనాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, స్టీల్, గృహోపకరణాలు, బొమ్మలు, టెక్స్‌టైల్స్, ఫర్నిచర్, పాదరక్షలు (ఫుట్‌వేర్), లెదర్ వస్తువులు, కాగితం, మోటార్‌సైకిళ్లు, అల్యూమినియం, గాజు, అలాగే సబ్బులు, పెర్ఫ్యూమ్‌లు, కాస్మెటిక్స్ వంటి అనేక ఉత్పత్తుల వర్గాలు ఇందులో ఉన్నాయి. అయితే చాలా వర్గాలకు 35% వరకు సుంకాలు ఎదురవుతాయి. కానీ ప్యాసింజర్ వాహనాలు వంటి కొన్ని ఉత్పత్తులపై సుంకాలు 2026 నుండి ఏకంగా 50%కి పెరుగుతాయి. ఈ మార్పు మెక్సికో ఇండియా వాణిజ్యంపై భారీ ప్రభావం చూపనుంది. Also Read 5వ రోజుకు చేరుకున్న ఇండిగో సంక్షోభం.. విమానాశ్రయాల్లో ప్రయాణికులు బాధలు చూస్తుంటే కన్నీళ్లు రావాల్సిందే.. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్.. తమ దేశంలోని స్థానిక ఉద్యోగాలు, తయారీ రంగాన్ని రక్షించడానికి ఈ అధిక సుంకాలు అవసరమని వాదించింది. సెనేట్ ఎకానమీ కమిటీ చైర్మన్ ఎమ్మాన్యుయెల్ రేయెస్ మాట్లాడుతూ.. “ఈ సర్దుబాట్లు మెక్సికన్ ఉత్పత్తులను గ్లోబల్ సప్లై చైన్స్‌లో పెంచుతాయి అలాగే కీలక రంగాలలో ఉద్యోగాలను కాపాడతాయి” అని తెలిపారు.

మెక్సికో ప్రభుత్వం వాదన ఏమిటి?

ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది చాలా గట్టి దెబ్బ. మెక్సికో మన దేశానికి సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత మూడవ అతిపెద్ద కార్ ఎగుమతి మార్కెట్. ప్యాసింజర్ కార్లపై సుంకం 20% నుండి 50%కి పెరగనుంది. దీనివల్ల ఫోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతి సుజుకి వంటి ప్రధాన భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితమవుతారు. భారతదేశ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (SIAM) ఈ సుంకాన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఈ పెంపు భారత ఆటోమొబైల్ ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, దీనిపై మెక్సికో ప్రభుత్వంతో చర్చించాలని వారు వాణిజ్య మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. భారతీయ కార్లు మెక్సికో దేశీయ పరిశ్రమకు ఎలాంటి ముప్పు కలిగించవని, ఎందుకంటే భారతీయ వాహనాలు ఉత్తర అమెరికా మార్కెట్‌కు మెక్సికో తయారుచేసే హై-ఎండ్ కార్ల విభాగంలోకి రారని ఆటోమేకర్లు వాదించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Breaking News in Telugu Economic Relations global trade policies Google News in Telugu import duties India trade impact international trade news Latest In telugu news market analysis Mexico tariffs Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.