Latest news: Mexico: ఛీ..ఛీ..ఇదేం పని.. రోడ్డుపై దేశాధ్యక్షురాలికి లైంగిక వేధింపులు

Read Time:  1 min
Mexico
Mexico
FONT SIZE
GET APP

మహిళ దేశానికి అధ్యక్షురాలైనా కామాంధులకు మాత్రం ఆ ఉన్నతమైన పదవిని చూడరు. స్త్రీనిగానే.. లైంగిక వాంఛల్ని తీర్చే వస్తువుగానే చూస్తుంటారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులకు ఓర్చి ఆ స్థాయికి చేరుకుని ఉంటారనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. పసిబిడ్డ నుంచి పండు ముసలమ్మ కనిపించినా తమ కోరిల్ని తీర్చుకోవాలని ఉబలాటపడతారు. తాజాగా(Mexico) మెక్సికో దేశాధ్యక్షురాలికి సైతం నడిరోడ్డుపై లైంగిక వేధింపులు(Sexual harassment) ఎదురయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: రేపే బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు

Mexico
ఛీ..ఛీ..ఇదేం పని.. రోడ్డుపై దేశాధ్యక్షురాలికి లైంగిక వేధింపులు

బహిరంగ కార్యక్రమంలో ఊహించని షాక్

మెక్సికో(Mexico) అధ్యక్షురాలి క్లాడియా షీన్ బామ్ మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఆమెపై చేయి వేస్తూ ముద్దు పెట్టుకోబోయాడు. అంతేకాక ఆమె ఛాతీ భాగాన్ని ముట్టుకోబోయాడు. వెంటనే అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టి ఆదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే బహిరంగ ప్రదేశంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారని మండిపడుతున్నారు. సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.