దిగుమతి సుంకాల విషయంలో మెక్సికో ప్రభుత్వం(Mexico Import Tariffs) కీలక అడుగు వేసింది. అమెరికా తరహాలోనే, తమ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి వచ్చే కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై భారీగా సుంకాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లుకు మెక్సికో సెనెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
Read Also: Brown University: యూనివర్సిటీలో కాల్పులు: ఇద్దరు మృతి,8 మంది గాయపడ్డారు
2026 జనవరి నుంచి అమల్లోకి కొత్త సుంకాలు
ఈ తాజా నిర్ణయం వల్ల భారత్, చైనా, దక్షిణ కొరియా సహా పలు ఆసియా దేశాల నుంచి మెక్సికోకు(Mexico Import Tariffs) వెళ్లే దాదాపు 1,400 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు(Taxes) గణనీయంగా పెరగనున్నాయి. కొత్త విధానంలో సుంకాలు కనీసం 5 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం వరకు ఉండనున్నట్లు వెల్లడైంది. ఇవన్నీ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
సెనెట్‌లో బిల్లుకు భారీ మెజార్టీతో మద్దతు
మెక్సికో సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు 76 మంది అనుకూలంగా ఓటు వేయగా, కేవలం ఐదుగురు మాత్రమే వ్యతిరేకించారు. దీంతో మెజార్టీ మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ నిర్ణయం అమలుతో ఆయా దేశాల నుంచి దిగుమతుల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :