📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: Mexico: మెక్సికోలో ముదురుతున్న జెన్ జెడ్ ఉద్యమం.. 120 మందికి గాయాలు

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశ్వవ్యాప్తంగా జెన్ జెడ్ ఉద్యమం విస్తరిస్తోంది. నేపాల్ లో (Nepal) రాజకీయ నాయకుల అవినీతిపై మొదలైన జెన్ జెడ్ ఉద్యమం ఒక్కోదేశానికి మెల్లగా పాకుతున్నది. ప్రత్యేకంగా రాజకీయ నేతలు, దేశాధినేతల నేరాలు, అవినీతి పెరుగుతున్న నేపధ్యంలో యువత వారిపై తిరుగుబాటుకు నడుం బిగిస్తున్నారు. తాజాగా మెక్సికోలో వేలాదిమంది జెన్ జెడ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

Read also : TET: టెట్ మినహాయింపుతో NEP రద్దు కోసం ఢిల్లీలో మహాధర్నా

ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్ బామ్ (Claudia Shinbaum) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని యువకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారుల ప్రయత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంనెలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలు, తాళ్లు, మండే పదార్థాలతో పోలీసులపై జెన్ జెడ్ దాడి చేసింది. ఈ ఘర్షణలో 120మంది గాయపడగా వీరిరి వందమంది పోలీసు అధికారులే ఉండడం గమనార్హం.

Mexico: Gen Z movement intensifying in Mexico.. 120 people injured

నేపాల్ లో మొదలైన హింస..

నేపాల్ లో మొదలైన జెన్ జెడ్ (Gen Z) ఉద్యమంతో రోడ్లపైకి వచ్చిన యువత రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలపై ఆందోళన చేసిన సంగతి విధితమే. అంతేకాదు ఏకంగా అధ్యక్ష భవనానికి నిప్పు పెట్టారు. మంత్రులపై భౌతిక దాడులకు దిగారు. షాపులను లూటీ చేశారు. గత్యంతరం లేక ఆ దేశ నేతలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇతర దేశాలకు పరుగులు తీయాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో ప్రధానమంత్రి, అధ్యక్షుడు సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం సుశీల కర్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్నది. అంతేకాదు ఈ హింసలో దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం అమెరికాను సైతం తాకింది. తాజాగా మెక్సికోలో (Mexico) జెన్ జెడ్ ఉద్యమం పేరట యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్ బామ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

హత్యతో మొదలైన ఉద్యమం

ఈనెల 1వ తేదీన మెక్సికో పశ్చిన రాష్ట్రమైన పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్ లోని ఉరుపాన్ నగర మేయర్ కార్లోస్ మంజో దారుణ హత్యకు గురయ్యాడు. నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనను ‘డే ఆఫ్ ది డెడ్’ అనే ఓ బహిరంగ కార్యక్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ దారున హత్య దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాల్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యాయంటూ నిరసనలకు దిగారు. మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాదిమంది యువత ప్రదర్శనలు చేపట్టారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Gen Z protests Google News in Telugu injuries reported. Latest News in Telugu mexico political unrest social movement Telugu News Today youth activism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.