El mencho death : మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

Read Time:  1 min
El mencho death
El mencho death
FONT SIZE
GET APP

El mencho death : మెక్సికోలో డ్రగ్ మాఫియా యుద్ధం మళ్లీ ఉధృతమైంది. కుఖ్యాత డ్రగ్ డాన్ ‘ఎల్ మెంచో’ సైనిక చర్యలో మరణించడంతో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు పెరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించింది.

ప్రత్యేకంగా జాలిస్కో, తమౌలిపాస్, మిచోకాన్, గెర్రెరో, న్యూవో లియోన్ రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయని ఎంబసీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉన్న భారతీయులు ఇంట్లోనే ఉండాలని, ప్యూర్టో వల్లార్టా, గ్వాడలజారా వంటి పర్యాటక ప్రాంతాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తమ క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తరచుగా తెలియజేయాలని సూచించింది.

Read Also:AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?

El mencho death
El mencho death

ఎల్ మెంచో మరణానికి ప్రతీకారంగా ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG)’ సభ్యులు హింసకు దిగినట్లు సమాచారం. పలు హైవేలపై వాహనాలకు నిప్పంటించడం, రహదారులు దిగ్బంధం చేయడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గ్వానాజువాటో ప్రాంతంలోనే డజన్ల సంఖ్యలో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. భారత ఐటీ నిపుణులు, విద్యార్థులు నివసించే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

కార్టెల్‌లో వారసత్వ పోరు చెలరేగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ హెల్ప్‌లైన్ +52-55-4847-7539 లేదా స్థానిక అత్యవసర సేవల నంబర్ 911ను సంప్రదించాలని అధికారులు సూచించారు. తాజా సమాచారం కోసం ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.