📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

WhatsApp: ప్రైవేట్ చాట్‌లను గుట్టుచప్పుడు కాకుండా చూస్తున్న మెటా సంస్థ?

Author Icon By Vanipushpa
Updated: January 28, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాట్సాప్‌లో మన వ్యక్తిగత సంభాషణలు ఎంత వరకు భద్రం? మనం పంపే మెసేజ్‌లు కేవలం మనకు, అవతలి వారికి మాత్రమే కనిపిస్తాయన్న వాట్సాప్ హామీ నిజమేనా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గర్వంగా చెప్పుకునే ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ ఫీచర్ కేవలం ఒక బూటకమని, మెటా సంస్థ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లను గుట్టుచప్పుడు కాకుండా చూస్తోందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో భారీ దావా నమోదైంది. దీంతో అందరి కన్ను వాట్సాప్ సంస్థపై పడగా.. దీనిపై ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలైన 51 పేజీల ఈ దావాలో.. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మెక్సికోకు చెందిన అంతర్జాతీయ వినియోగదారులు వాట్సాప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వాట్సాప్ (WhatsApp) భద్రత కేవలం పేరుకేనని, మెటా ఇంజినీర్లు వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను సులభంగా యాక్సెస్ చేయగలరని చెబుతున్నారు. సాధారణంగా ఎన్‌క్రిప్షన్ అంటే సందేశాలను పంపే వారు, స్వీకరించే వారు తప్ప మూడో వ్యక్తి (కంపెనీతో సహా) చదవలేరు. కానీ ఒక చిన్న ‘టాస్క్’ రిక్వెస్ట్ పంపడం ద్వారా మెటా ఉద్యోగులు ఏ వినియోగదారుడి మెసేజ్‌లైనా చూడవచ్చని పిటిషనర్లు ఆరోపించారు.

Read Also: Kerala: Influencer షింజితా ముస్తఫాకు కోర్టు షాక్

WhatsApp: ప్రైవేట్ చాట్‌లను గుట్టుచప్పుడు కాకుండా చూస్తున్న మెటా సంస్థ?

పిటిషనర్లు చేస్తున్న వాదనలు అవాస్తం: కోర్టు

ఈ ఆరోపణల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. వినియోగదారులు తమ ఫోన్లలో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా మెటా యాక్సెస్ చేస్తోందని చెప్పడం . ఒక ప్రత్యేక ‘విడ్జెట్’ ద్వారా యూజర్ల మెసేజ్‌లు రియల్ టైమ్‌లో కంపెనీ ఉద్యోగులకు కనిపిస్తాయని, దీనికి ఎలాంటి కాల పరిమితి లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు నిజమని చూపేందుకు వారి ఎలాంటి సాంకేతిక ఆధారాలను కోర్టుకు చూపలేదు. దీంతో ఈ పరిణామాలపై మెటా తీవ్రంగా స్పందించింది. పిటిషనర్లు చేస్తున్న వాదనలు అవాస్తవాలని, పూర్తిగా అసంబద్ధమైనవని కొట్టి పారేసింది. వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్పందిస్తూ.. కేవలం వార్తల్లో కనిపించేందుకు మాత్రమే పలువురు ఇలాంటి పనికిమాలిన ఆరోపణలతో కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

data privacy issues digital privacy rights Meta controversy Meta privacy concerns private chat monitoring social media surveillance Telugu News Paper Telugu News Today user data security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.