AI Effect: 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

Read Time:  1 min
16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా
16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా
FONT SIZE
GET APP

టెక్ ఉద్యోగాలు ఈ ఏడాది కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. AI ఖర్చులు రోజు రొజుకు పెరుగుతున్నందున కంపెనీలు ఉద్యోగులను తగ్గించి ఖర్చు భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తొలగించగా అదే బాటలో మార్క్ జుకర్‌బర్గ్ టెక్ సంస్థ కూడా పయనిస్తోంది. దాదాపు 16 వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని Meta కంపెనీ, ఖరీదైన కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, AI-ఆధారిత సామర్థ్యాన్ని పెంచడానికి భారీ ఉద్యోగ కోతలను ప్రణాళికలో పెట్టింది. ఈ తొలగింపులు మొత్తం సిబ్బందిలో 20 శాతం వరకు, అంటే దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని అంచనా. అయితే, ఈ తొలగింపులకు ఖచ్చితమైన తేదీలు లేదా సంఖ్య ఇంకా ఖరారు కాలేదు.

Read Also: Strait of Hormuz: హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

AI Effect: Meta to send 16,000 employees home
AI Effect: Meta to send 16,000 employees homeAI Effect: Meta to send 16,000 employees home

Meta ప్రతినిధి ఆండీ స్టోన్ ప్రకారం..

Meta టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ ప్రణాళికలను సీనియర్ నాయకులకు తెలియజేశారు. తిరిగి ఉద్యోగులను ఎలా మేనేజ్ చేయాలి, దానిపై ప్రణాళికలు వేయడం ప్రారంభమయ్యాయి.ఈ ప్రణాళికలు “సైద్ధాంతిక” అంశాలుగా మాత్రమే ఉన్నాయి. Meta డిసెంబర్ 31, 2025 నాటికి దాదాపు 79,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 20 శాతం సంఖ్యను గణిస్తే, ఈ ఉద్యోగ కోత గత కొన్ని సంవత్సరాలలో అత్యంత పెద్ద తొలగింపుగా ఉంటుంది. గతంలో.. నవంబర్ 2022లో Meta 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది (మొత్తం సిబ్బంది 13 శాతం) కాగా నాలుగు నెలల తర్వాత మరో 10 వేల మంది ఉద్యోగులను తగ్గించామని ప్రకటించింది.
AI ప్రాజెక్టులపై CEO జుకర్‌బర్గ్ గణనీయంగా దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రణాళికలో జనరేటివ్ AI పరిశోధకులను కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేర్చడానికి కంపెనీ వందల మిలియన్ల డాలర్ల వేతన ప్యాకేజీలు అందించింది. 2028 నాటికి డేటా సెంటర్ల నిర్మాణానికి 600 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా కంపెనీ యోచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.