క్రిస్మస్(Merry Christmas) పండుగతో ప్రపంచమంతా ఆనందం, ఉత్సాహంతో నిండిపోయింది. ప్రతి ఏటా యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈ పవిత్ర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రేమ, కరుణ, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగ ప్రతి హృదయానికీ సందేశం ఇస్తుంది.
యేసు సందేశం.. పరిశుద్ధ జీవన మార్గం
పాపాన్ని విడిచిపెట్టి, మనసా–వాచా–కర్మణా సత్యం, నైతికతతో జీవించాలనే బోధనను యేసుక్రీస్తు అందించారు. చెడును దూరం పెట్టి మంచిని ఆచరించిన వారిలోనే ఆయన నివసిస్తాడని విశ్వాసం. ప్రేమను పంచుతూ, క్షమను అలవర్చుకుంటూ జీవించడమే క్రిస్మస్(Merry Christmas) అసలైన ఆత్మసారం. క్రిస్మస్ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆశ, శాంతిని నింపుతుంది. ఈ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: