📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Mehul Choksi: చోక్సీకి చెందిన విలువైన ఆస్తులు వేలం

Author Icon By Anusha
Updated: November 10, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ఆర్థిక రంగాన్ని కుదిపేసిన రూ. 23,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ (Mehul Choksi) కి చెందిన ఆస్తులను విక్రయించేందుకు ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం,

Read also: Railway: టికెట్ బుకింగ్‌ వ్యవస్థలో మార్పులు

గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ (GGL) సంస్థకు చెందిన 13 అసురక్షిత ఆస్తులను (Mehul Choksi) వేలం వేయడానికి అనుమతి లభించింది. ఈ ఆస్తుల అంచనా విలువ 2018 నాటికి సుమారు రూ. 46 కోట్లుగా ఉంది.ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రత్యేక కోర్టు పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా (FD) ఉంచాలి.

ట్రయల్ పూర్తయిన తర్వాతే ఆ డబ్బు యాజమాన్యం, జప్తుపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.వేలం వేయనున్న ఆస్తుల్లో ముఖ్యంగా.. బోరివలిలో ఉన్న నాలుగు ఫ్లాట్‌లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2.6 కోట్లు. అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని భారత్ డైమండ్ బూర్స్‌లో 14 కార్ పార్కింగ్‌లతో సహా ఒక వాణిజ్య యూనిట్‌ ఉంది.

అసురక్షిత ఆస్తులను మాత్రమే వేలం

దీన్ని కూడా ప్రస్తుతం వేలం వేయబోతున్నారు. అయితే దీని విలువ సుమారు రూ19.7 కోట్లు. ఇక గోరేగావ్ ఈస్ట్‌లోని ఆరు ఇండస్ట్రియల్ గాలాలు, ఉద్యాగ్ నగర్‌లోని మరో గాలాను కూడా వేలం వేయనున్నారు. జైపూర్‌లోని కంపెనీ కేంద్రంలో ఉన్న వెండి ఇటుకలు,

Mehul Choksi

సెమీ-ప్రీషియస్ రాళ్లు, ఇతర యంత్రాలను సైతం వేలం వేస్తున్నారు.అయితే ఈ వేలంలో అసురక్షిత ఆస్తులను మాత్రమే వేలం వేయాలని, సురక్షిత రుణదాతలు క్లెయిమ్ చేసిన వాటిని వేలం వేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈడీ దర్యాప్తులో GGL సంస్థ పీఎన్‌బీ స్కామ్‌లో కీలక పాత్ర పోషించింది.

బెల్జియం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ

మరోవైపు, పీఎన్‌బీ స్కామ్‌కు సంబంధించి విదేశాల్లో తలదాచుకుంటున్న చోక్సీకి బెల్జియం కోర్టులోనూ ఇటీవల గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీని భారత్‌కు అప్పగించడానికి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని, ఆయనపై ఉన్న ఆరోపణలు ‘సమర్థనీయమైనవిగా’ కోర్టు పేర్కొంది.

చోక్సీ బెల్జియం (Belgium) పౌరుడు కాకపోవడం, ఆయన పాత్ర తీవ్రమైన నేరాలతో (క్రిమినల్ గ్యాంగ్‌లో భాగస్వామ్యం, మోసం, అవినీతి) ముడిపడి ఉండటం వల్ల అప్పగింత సమంజసమేనని కోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే చోక్సీ ఈ తీర్పును సవాలు చేస్తూ బెల్జియం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

Geetanjali Gems latest news mehul choksi Mumbai Special Court PNB Scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.