పశ్చిమ జర్మనీలోని హెర్డెక్కే పట్టణానికి కొత్తగా ఎన్నికైన మేయర్ ఐరిస్ స్టాల్జర్(Ute Iris Stalzer) కత్తిపోట్లకు గురయ్యారు. ఆమె ఇంటిలో తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ టీం హెలికాప్టర్‌లో ఆమెను ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
Madhya Pradesh: కలుషిత దగ్గు సిరప్ కేసు: సుప్రీం కోర్టులో దాఖలు
మేయర్ ఎన్నికల్లో స్టాల్జర్ విజయం
అయితే ఈ ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక ఘోరమైన చర్యగా విమర్శించారు. ఐరిస్ స్టాల్జర్ పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 57 ఏళ్ల ఐరిస్ స్టాల్జర్ సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ (SPD) సభ్యురాలు. సెప్టెంబర్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో స్టాల్జర్ విజయం సాధించారు.
ఐరిస్ స్టాల్జర్ ఎవరు?
ఉటే ఐరిస్ స్టాల్జర్ (జననం 1968) సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD) నుండి జర్మన్ రాజకీయ నాయకురాలు. ఆమె నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని ఆగ్నేయ రుహ్ర్ ప్రాంతంలోని హెర్డెక్కేకు నియమించబడిన మేయర్.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: