📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Canary Islands : టూరిజంకు వ్యతిరేకంగా కేనరీ ప్రజల భారీ నిరసన ప్రదర్శన

Author Icon By Sudha
Updated: May 19, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్పెయిన్‌లోని కేనరీ దీవుల ప్రజలు పర్యాటకుల రాకను నిరోధిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. “కేనరీలకు పరిమితి ఉంది” అనే నినాదంతో, స్థానికులు పర్యాటకుల సంఖ్యను నియంత్రించాలంటూ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. సుమారు 16 మిలియన్ల మంది పర్యాటకులు 2023లో ఈ దీవులను సందర్శించారు, ఇది స్థానిక జనాభా 2.2 మిలియన్ల కంటే చాలా ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. తమ దేశానికి రండి అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్ట్‌లను ఆహ్వానిస్తుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్‌లను కూడా ప్రకటిస్తుంటుంది. పర్యాటక రంగం మెరుగుపడితేనే పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అంతేకాదు స్థానికులకు కూడా మంచి ఉపాధి ఉంటుంది. అయితే, స్పెయిన్‌ (Spain)లోని కేనరీ ఐలాండ్ (Canary Islands) ప్రజలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. పర్యాటకులు తమ దేశానికి రావొద్దంటూ ఏకంగా వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు (protest against tourism).

Canary Islands : టూరిజంకు వ్యతిరేకంగా కేనరీ ప్రజల భారీ నిరసన ప్రదర్శన

ప్రతి నెలా 1 మిలియన్ల
కేనరీ దీవులు.. వాయువ్య ఆఫ్రికా తీరంలో ఉన్న స్పానిష్ ద్వీపసమూహం. ఈ దీవులను సందర్శించేందుకు ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటారు. అయితే, అపరిమిత పర్యాటకంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు, స్థానికులకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేనరీ ద్వీపసమూహంలోని ఏడు దీవుల్లో నిరసన ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. ప్రతి నెలా 1 మిలియన్ల మందికి పైగా పర్యాటకులు రావడం, స్థానిక వసతి, నీటి సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది.
కేనరీ దీవులు మీ స్వర్గదామం కాదు’
‘కేనరీ దీవులు అమ్మకానికి లేవు’, ‘కేనరీ దీవులు మీ స్వర్గదామం కాదు’ వంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ వేల సంఖ్యలో ప్రజలు ర్యాలీచేపట్టారు. అధిక పర్యాటక ప్రభావాన్ని అరికట్టాలని, అద్దెలను నియంత్రించాలని, కొత్త పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ నినదించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దీపసమూహంలోని అతిపెద్ద దీవి అయిన టెనెరిఫేలో 7,000 మంది, గ్రాన్ కెనరియాలో 3,000 మంది, లాంజరోట్‌లో 1,500 మంది, ఫ్యూర్టెవెంచురాలో 1,000 మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
కాగా, కేనరీల్లో పర్యాటక అభివృద్ధిని స్థానిక ప్రజలు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోకుండా పర్యావరణం, నివాసితులకు నష్టం కలిగించే విధంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, పర్యాటక రంగం వల్ల ఈ దీవుల్లో ప్రతి పది మందిలో నలుగురికి ఉపాధి లభిస్తోందని, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 36 శాతం వాటా ఇదే రంగం నుంచి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యాటకుల అధిక సంఖ్య పర్యావరణానికి హానికరంగా మారుతోంది, సముద్ర కాలుష్యం, ప్రకృతి వనరుల వినియోగం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Read Also : Army Personnel Blackmailing: జవాన్ దారుణం: మహిళ బాత్రూమ్​లో రహస్య కెమెరా

against tourism Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Massive protest by Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.