📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest Telugu news : Masood Azhar: ఆప‌రేష‌న్ సింధూర్ తో మ‌సూద్ కుటుంబం ముక్క‌లైంది : జైషే క‌మాండ‌ర్‌

Author Icon By Sudha
Updated: September 16, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆప‌రేష‌న్ సింధూర్ దాడిలో మ‌సూద్ అజార్ (Masood Azhar)కుటుంబం ముక్క‌లైన‌ట్లు జైషే క‌మాండ‌ర్ ఇల్యాస్ పేర్కొన్నాడు. అత‌ను ప్ర‌సంగిస్తున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త మిలిట‌రీ ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindhur)చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. పాక్‌లో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను ఆ దాడితో ధ్వంసం చేశారు. అయితే ఆ భీక‌ర దాడిలో ఉగ్ర‌వాది మ‌సూద్ అజార్‌(Masood Azhar)కు చెందిన కుటుంబం ముక్క‌లై పోయింద‌ని జైషే మొహ‌మ్మ‌ద్ క‌మాండ‌ర్ మ‌సూద్ ఇల్యాస్ క‌శ్మీరీ అంగీక‌రించాడు. బ‌హ‌వ‌ల్‌పూర్‌లో ఉన్న మ‌సూద్ అజార్ ఇంటిని ఆప‌రేష‌న్ సింధూర్‌లో భాగంగా పేల్చి వేశారు. జైషే క‌మాండ‌ర్ మ‌సూద్ ఇల్యాస్ క‌శ్మీరీ ప్ర‌సంగిస్తున్న వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది. భార‌తీయ ఆర్మీ ఎలా త‌మ స్థావ‌రంపై దాడి చేసింద‌న్న విష‌యాన్ని ఆ వీడియో ప్ర‌సంగంలో అత‌ను వెల్ల‌డించాడు. ఉగ్ర‌వాదం బాట‌లో ముందుకు వెళ్లామ‌ని, ఢిల్లీ.. కాబూల్.. కాంద‌హార్‌లో పోరాడామ‌ని, ఈ దేశ స‌రిహ‌ద్దులను ర‌క్షించుకున్నామ‌ని, స‌ర్వ‌స్వం త్యాగం చేశామ‌న్నాడు.

Masood Azhar: ఆప‌రేష‌న్ సింధూర్ తో మ‌సూద్ కుటుంబం ముక్క‌లైంది : జైషే క‌మాండ‌ర్‌

కానీ మే 7వ తేదీన భార‌త బ‌ల‌గాలు చేసిన దాడిలో మౌలానా మ‌సూద్ అజార్ Masood Azhar)కుటుంబం ముక్క‌లైపోయింద‌ని జైషే క‌మాండ‌ర్ క‌శ్మీరీ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నాడు. ఉర్దూ భాష‌లో అత‌ను మాట్లాడాడు. అత‌ను ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో అత‌ని వెనుక గ‌న్నుల ప‌ట్టుకుని సెక్యూర్టీ సిబ్బంది ఉన్నారు.పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది భార‌తీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టారు. పాక్‌లో ఉన్న జైషే మ‌హ‌మ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర స్థావ‌రాల‌ను టార్గెట్ చేశారు. బ‌హ‌వ‌ల్‌పూర్, కోట్లి, మురిదికేతో పాటు మొత్తం 9 స్థావ‌రాల‌ను పేల్చివేశారు. పాక్‌లో 12వ అతిపెద్ద న‌గ‌రం బ‌హ‌వ‌ల్‌పుర్ . జైషే ఉగ్ర సంస్థ కార్య‌క‌లాపాల‌కు ఆ ప్రాంతం కీల‌కంగా నిలిచింది. లాహోర్‌కు 400 కిలోమీట‌ర్ల దూరంలో ఆ ప‌ట్ట‌ణం ఉన్న‌ది. జైషే ప్ర‌ధాన కార్యాల‌యం జామియా మ‌జీద్ సుభాన్ అల్లా అక్క‌డే ఉన్న‌ది. దీన్నే ఉస్మాన్ ఓ అలీ క్యాంప‌స్ అని కూడా పిలుస్తారు .

జైష్ ఎ మహమ్మద్ ఉగ్ర సంస్థ లక్ష్యం ?

కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్ నించి విడదీసి పాకిస్తాన్ లో కలపాలన్న లక్ష్యంతో జైష్ ఎ మహమ్మద్ ఉగ్ర సంస్థ పని చేస్తోంది.అందుకోసం కాశ్మీర్ రాష్ట్రంలో పలు తీవ్రవాద దాడులు చేసింది.జైష్-ఎ-మహమ్మద్ ను2000వ సంవత్సరంలో మసూర్ అజహర్ ఏర్పాటు చేశాడు.కాశ్మీర్ రాష్ట్రంలో షరియా చట్టాలను అమలు చేయాలని కూడా దీని లక్ష్యం. మొదట కాశ్మీర్ ని ఆక్రమించి తర్వాత భారత్ లోని మిగిలిన భూభాగాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనేది ఈ బృందం ఆశయం.

మసూద్ అజార్ ఎవరు ?

మహ్మద్ మసూద్ అజార్ అల్వీ పాకిస్తాన్ తీవ్రవాది .ఉగ్రవాద సంస్థ అయినా జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు వ్యవస్థాపకుడు, నాయకుడు. 2019 మే 1న, మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా జాబితాలో చేర్చింది.

https://twitter.com/OsintTV/status/1967795074974294029

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/donald-trump-tough-action-against-criminals-in-america-trump-warns/international/548256/

Breaking News Indian Army Jaish Commander Jaish-e-Mohammed latest news Masood Azhar Operation Sindhoor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.