📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Mary Millben: మోదీ ట్రంప్ కి ఎందుకు బయపడుతాడు అమెరికన్ సింగర్

Author Icon By Sushmitha
Updated: October 17, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీపై(Narendra Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారన్న రాహుల్ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ప్రధాని మోదీ దేశ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనది భయం కాదని మిల్బెన్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆమె ఒక ఘాటు పోస్ట్ పెట్టారు.

Read Also: Shabarimala: శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్

మోదీ నాయకత్వంపై మిల్బెన్ ప్రశంసలు

మేరీ మిల్బెన్(Mary Milben) తన పోస్ట్‌లో, “రాహుల్ గాంధీ,(Rahul Gandhi) మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీకి ట్రంప్‌ అంటే భయం లేదు. ఆయనకు దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాత్మక దౌత్యనీతిపై పూర్తి అవగాహన ఉంది” అని పేర్కొన్నారు. ఒక దేశాధినేతగా ట్రంప్ ఎలాగైతే అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారో, మోదీ కూడా భారత్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, దానిని తాను అభినందిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా, “ఈ తరహా నాయకత్వం మీకు అర్థమవుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే భారత ప్రధాని అయ్యే పటిమ మీకు లేదు” అని ఆమె ఘాటుగా విమర్శించారు.

వివాదానికి కారణమైన ట్రంప్ వ్యాఖ్యలు

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ఆపేస్తుందని ట్రంప్ చేసిన ఒక ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందించారు. “ప్రధాని మోదీకి ట్రంప్‌ అంటే భయం” అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. అయితే, గురువారం విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనబోమని భారత్ తనకు హామీ ఇచ్చిందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఆధారంగానే రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాగా, సెప్టెంబర్ నెలలో కూడా భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో 34 శాతం రష్యా నుంచే సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మిల్బెన్ నేపథ్యం

మేరీ మిల్బెన్ 2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనను తొలిసారి కలిశారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత, మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన మేరీ మిల్బెన్ ఎవరు?

ఆమె అమెరికాకు చెందిన ప్రముఖ గాయని మరియు నటి.

మిల్బెన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

ప్రధాని మోదీకి దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాత్మక దౌత్యనీతిపై అవగాహన ఉందని, ఈ తరహా నాయకత్వం రాహుల్‌కు అర్థం కాదని ఆమె విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Donald Trump Google News in Telugu india Indian National Anthem Latest News in Telugu Mary Millben Narendra Modi political feud rahul gandhi Telugu News Today US Relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.