📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mary Millben : మోదీకి ట్రంప్ క్షమాపణ చెప్పాలా? మేరీ మిల్బెన్ వ్యాఖ్యలు

Author Icon By Sai Kiran
Updated: January 28, 2026 • 9:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా–భారత్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, ప్రముఖ అమెరికన్ గాయని మరియు నటి Mary Millben భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యనీతిపై ప్రశంసలు కురిపించారు. భారత్ పట్ల అమెరికా ప్రభుత్వం ఇటీవల అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఆమె, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు Donald Trump తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒత్తిడిలోనూ ప్రధాని మోదీ ప్రదర్శిస్తున్న సంయమనం, (Mary Millben) హుందాతనం ప్రపంచ వేదికపై ఆయనను గౌరవనీయమైన నాయకుడిగా నిలబెట్టిందని మిల్బెన్ పేర్కొన్నారు. అమెరికా నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూ భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగిందని ఆమె అన్నారు. భారత్–ఈయూ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల

Mary Millben

ట్రంప్‌ను ఉద్దేశిస్తూ, “ఇదే సరైన సమయం. ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పి, భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. ఇది బలహీనత కాదు, బలానికి సంకేతం” అని మిల్బెన్ సూచించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

American singer comments Breaking News in Telugu global politics news Google News in Telugu India EU trade deal India US relations Latest News in Telugu Mary Millben Modi Diplomacy Modi international relations Telugu News Trump apology Modi Trump India controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.