📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Mariam: టిక్‌టాక్ స్టార్‌ను హతమార్చిన జిహాదీలు

Author Icon By Sushmitha
Updated: November 10, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో జిహాదీ ఉగ్రవాదులు దారుణమైన చర్యకు పాల్పడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో(TikTok) వీడియోలు పోస్ట్ చేస్తూ పాప్యులర్ అయిన ఒక యువతిని కిడ్నాప్ చేసి, బహిరంగంగా కాల్చి చంపారు. ఆమె సైన్యానికి గూఢచారిగా పనిచేస్తోందన్న ఆరోపణలతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Read also: Sunita Ahuja: బాబోయ్.. మరో జన్మ ఉంటే భర్తగా గోవిందా వద్దు

Mariam

యువతికి 90 వేల మంది ఫాలోవర్లు

ఉత్తర మాలిలోని టింబక్టు ప్రాంతంలోని టోంకా నగరానికి చెందిన మరియమ్ సిస్సే(Mariam Cisse) అనే యువతి టిక్‌టాక్‌లో స్థానిక విశేషాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సుమారు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గురువారం కొందరు జిహాదీలు ఆమెను అపహరించారు. మాలి సైన్యంకు తమ కదలికల గురించి ఆమె సమాచారం చేరవేస్తోందని వారు ఆరోపించారు. ఆ మరుసటి రోజు శుక్రవారం, మరియమ్‌ను ఒక మోటార్‌బైక్‌పై టోంకా నగరంలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌కు తీసుకొచ్చారు. అక్కడి జనసమూహం చూస్తుండగానే ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. “వారు నా సోదరిని చంపేటప్పుడు నేను ఆ గుంపులోనే ఉన్నాను” అని ఆమె సోదరుడు ఆవేదనతో వెల్లడించారు.

భద్రతా పరిస్థితులు, ఉగ్రవాద కార్యకలాపాలు

ఈ ఘటనను ఒక భద్రతా అధికారి ధ్రువీకరిస్తూ, “మాలి సైన్యం కోసం జిహాదీలను వీడియో తీస్తోందని ఆరోపిస్తూ మరియమ్ సిస్సేను బహిరంగంగా హత్య చేశారు. ఇది అత్యంత అనాగరికమైన చర్య” అని పేర్కొన్నారు. 2012 నుంచి మాలి దేశం జిహాదీ ఉగ్రవాదంతో పోరాడుతోంది. ఇటీవలే అల్-ఖైదాతో సంబంధాలున్న జేఎన్ఐఎం అనే ఉగ్రవాద సంస్థ దేశంలో ఇంధన దిగ్బంధనం విధించింది. దీనివల్ల పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడటంతో పాటు పంటల కోతలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్య దేశంలోని భద్రతా పరిస్థితులకు అద్దం పడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

Google News in Telugu Guerilla warfare Jihadi JNIM Latest News in Telugu mali Mariam Cisse Social Media Telugu News Today Terrorism TikTok star Timbuktu West Africa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.