📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Mariam: ఇండియాకు మేం దగ్గరైనందుకే పాక్ దాడులు

Author Icon By Saritha
Updated: October 18, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాక్ ఆర్మీకి ఆఫ్ఘాన్ మాజీ ఎంపీ హెచ్చరిక

పాకిస్తాన్ (Pakistan) సైన్యం జరిపిన తాజా వైమానిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫ్ఘానిస్థాన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు మరియం సొలైమాంకిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు పెంచిన ఉగ్రవాదం చివరికి మీకే హాని చేస్తుంది. మాపై దాడులు చేయడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో మీరే పశ్చాత్తాపపడాల్సిన రోజు దగ్గర్లో ఉంది” అని ఆమె (Mariam) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ దేశవాళీ క్రికెటర్లు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ దాడులపై స్పందించిన మరియం, మహిళలు, చిన్నారులు బలయ్యారని, ఈ దృశ్యాలు తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు.

Read also: తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూ ప్రకంపనలు

Mariam: ఇండియాకు మేం దగ్గరైనందుకే పాక్ దాడులు

ఉగ్రవాద క్యాంపుల పేరిట పౌరులపై దాడులు – పాక్ కు మరియం ఆగ్రహం

ఆఫ్ఘానిస్థాన్-భారతదేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న ప్రతిసారీ పాకిస్తాన్ అడ్డుపడుతోందని మరియం ఆరోపించారు. శాంతిని తట్టుకోలేకే పాక్ ఇటువంటి చర్యలకు దిగుతోందన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నట్టు చెబుతూ, పౌరులపై బాంబులు వేస్తోందని ఆమె (Mariam) విమర్శించారు.

ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఒక్క ఉగ్రవాది కూడా మరణించినట్లు పాక్ నిరూపించలేదని, సమాజంలోని అమాయకులే ఈ దాడుల బారినపడుతున్నారని ఆమె అన్నారు. దాడుల వల్ల చిన్నారులు, మహిళలు మృత్యువాత పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఇది మానవత్వానికి మచ్చ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

https://vaartha.com/sports/ind-vs-aus-first-odi-series-starts-tomorrow/567270/

Afghan MP warning Afghan women Breaking News in Telugu Maryam Solaimankhel Pakistan airstrikes Pakistan Terrorism Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.